Banswada: పేద విద్యార్థులకు డాక్టర్ సంతోష్ రెడ్డి రూ.60 వేల ఆర్థిక సాయం!

Banswada: కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌కు చెందిన ఇద్దరు పేద విద్యార్థినుల ఉన్నత చదువుల కోసం బాన్సువాడ అన్విత హాస్పిటల్ డాక్టర్ సంతోష్ రెడ్డి రూ.60 వేల ఆర్థిక సాయం అందజేశారు.

Update: 2026-08-28 12:26 GMT

Banswada: పేద విద్యార్థులకు డాక్టర్ సంతోష్ రెడ్డి రూ.60 వేల ఆర్థిక సాయం!

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నెమలి గ్రామానికి చెందిన పేద విద్యార్థులు బండి కావేరి, చిట్టి మానసలకు బాన్సువాడ పట్టణానికి చెందిన అన్విత హాస్పిటల్ డాక్టర్ సంతోష్ రెడ్డిMD. శుక్రవారం ఆర్థిక సహాయం అందించి వారికి అండగా నిలిచి,పెద్ద మనస్సును చాటుకున్నారు.

హైదరాబాద్‌లోని దోమలగూడ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో UGDPED రెండేళ్ల కోర్సులో చదువుతున్న విద్యార్థుల విద్యాభ్యాసానికి అవసరమైన ఖర్చుల కోసం రూ.60 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

క్రీడారంగంలో ప్రతిభ కనబరుస్తున్న పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు డాక్టర్ సంతోష్ రెడ్డి ముందుకు రావడంపై క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువుకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ సంతోష్ రెడ్డి కి క్రీడాకారుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News