Nellore: రూ.40 లక్షలతో ఆలయ పునఃనిర్మాణం: భూమిపూజ చేసిన మంత్రి నారాయణ!
Nellore: నెల్లూరు 50వ డివిజన్ బుజ్జమ్మ రేవు సమీపంలో రూ.40 లక్షలతో చేపట్టనున్న సిద్ధి వినాయక ఆలయ పునఃనిర్మాణానికి మంత్రి పొంగూరు నారాయణ దంపతులు భూమిపూజ చేశారు.
Nellore: రూ.40 లక్షలతో ఆలయ పునఃనిర్మాణం: భూమిపూజ చేసిన మంత్రి నారాయణ!
నెల్లూరు: నెల్లూరు నగరంలోని 50వ డివిజన్ బుజ్జమ్మ రేవు సమీపంలో సిద్ధి వినాయక ఆలయ పునఃనిర్మాణానికి సతీమణి రమాదేవితో కలిసి మంత్రి నారాయణ భూమి పూజ చేశారు. మంత్రి దంపతులకు నగర టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కపిర రేవతి,రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు దంపతులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.గతంలో ఇక్కడ నాలుగు గోడలతో మాత్రమే ఉన్న చిన్న ఆలయాన్ని నిరుపేదలైన స్థానికులు అభివృద్ధి చేయలేక వదిలేశారని, ఎన్నికల ప్రచారంలో కపిర రేవతి, సీనయ్య కోరిక మేరకు తాను ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజల్లో భక్తిభావం పెరిగిన నేపథ్యంలో ఈ ఆలయ నిర్మాణ పనులను బాధ్యులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు.