Nellore: ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం!
Nellore: ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్, రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం. దాతలకు సర్టిఫికెట్లు, బహుమతుల పంపిణీ.
Nellore: ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం!
Nellore: ఏసి సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ గత 26 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది . అందులో భాగంగా ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి చేత బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది అని ఏసి సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు
ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో రూపొందించి ఇటు వాకర్స్ కి అటు ప్రజానీకానికి పేదవారికి సహాయం చేస్తామని తెలియజేశారు .
ఇటువంటి గొప్పమెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో నన్ను భాగస్వామిని చేసి నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ చేసే కార్యక్రమాలకు నా వంతు సహాయం తప్పకుండా ఉంటుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసినటువంటి దాతలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారిచే గుర్తింపు పత్రము ఫోన్ స్టాండు జ్యూస్ బాటిల్ ఉడకబెట్టిన కోడుగుడ్డు బ్రేక్ఫాస్ట్ ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది .
ఈ కార్యక్రమాన్ని మా సభ్యులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మోటివేటర్ అరిగల సాయిరాం గారు అందరితో కోఆర్డినేట్ చేసుకుని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ తో పాటు సెక్రటరీ సేగు రమేష్, ట్రెజరర్ తిరుపతి శేఖర్ జాలివాకర్ మెంటా రామారావు పత్తి సుధాకర్ బాదం హరికృష్ణ ,భగవతుల విజయ రాఘవేంద్ర, గాలి రఘురామ నాయుడు గింజం రామానాయుడు తాళ్లూరి కృష్ణమ నాయుడు కిలారి తిరుపతి నాయుడు ఒంగోలు నరసయ్య పాల్గొన్నారు.అలాగే నిర్మలా నరసింహారెడ్డి బుర్ర వెంకటేశ్వర్లు గౌడ్ పలువురు ప్రముఖులు పాల్గొని అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను అభినందించడం జరిగింది.