Nellore: సైదాపురం పీఏసీఎస్‌కు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు!
Nellore: 2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ నెల్లూరు జిల్లా సైదాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి అవార్డు దక్కించుకుంది.
Nellore: సైదాపురం పీఏసీఎస్‌కు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు!
నెల్లూరు: నెల్లూరు జిల్లా సైదాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన సంఘంగా ఎంపికైంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు 63వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విజయవాడలోని గవర్నర్పేటలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమానిలో ఉత్తమ సేవలు అందించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సైదాపురంకు సంబం ధించి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను.పీఏసీఎస్ అధ్యక్షుడు అమ్మినేని సుబ్రమణ్యం నాయుడు.
సీఈవో బంకారపు శ్రీనివాసులురావుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పి రామకృష్ణ, నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. సైదాపురం పీఏసీఎస్ రాష్ట్రస్థాయిలో ఉత్తమ సంఘంగా గుర్తింపు పొందడం సహకార సంఘం పాలకవర్గం,అధికారులు, సిబ్బంది.సభ్య రైతులు పలువురు గర్వకారణమైనదిగా అభిప్రాయం వ్యక్తం చేసిన పీఏసీఎస్ అధ్యక్షుడు అమ్మినేని సుబ్రమణ్యం నాయుడు.