Nellore: తీవ్ర ఉద్రిక్తత వైసీపీ రిలే దీక్షను అడ్డుకున్న పోలీసులు!

Nellore: పీ డీఎస్సీ అక్రమాలపై నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్లో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Update: 2026-08-06 06:17 GMT

Nellore: తీవ్ర ఉద్రిక్తత వైసీపీ రిలే దీక్షను అడ్డుకున్న పోలీసులు!

నెల్లూరు: నెల్లూరు నగర పోలీసులు కమిషనర్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇంచార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి. ఏపీ డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ విచారణ కోరుతూ ఇవాళ వైసిపి రాష్ట్రస్థాయిలో చేపట్టిన రిలే దీక్షలో భాగంగా రూరల్ ఇన్చార్జి విజయ్ కుమార్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మతో కలిసి కరెంట్ ఆఫీస్ సెంటర్ కు చేరుకున్నారు.

కరెంట్ ఆఫీస్ సెంటర్లో వైసిపి నిరసన దీక్షకు అనుమతి లేదంటూ ఆనం విజయ్ కుమార్ రెడ్డి వారి అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విజయ్ కుమార్ రెడ్డి అక్కడ నుంచే పోలీసులు నగర కమిషనర్ కు ఫోన్ చేశారు. అధికారులు, పోలీసులు పరస్పరం ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ అనుమతికి నిరాకరించడంతో ఒక్కసారిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.

ప్రజాస్వామ్యంగా పోలీసుల అనుమతితో రిలే దీక్షకు చేపడితే ఇప్పుడు అర్ధాంతరంగా ఆపడం ఏమిటంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపడం ప్రతిపక్షాలకు ఉన్న హక్కు అని, ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. అధికారిక అనుమతి ఉన్నా లేదంటూ పోలీసులు కార్పొరేషన్ కమిషనర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి.

ఈ సందర్బంగా పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది.ఎన్ని ఆంక్షలు విధించినా దీక్ష చేసేదే అంటూ ఆనం విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.డీఎస్సీలో జరిగిన అక్రమాలుపై సిబిఐతో విచారణ జరిపి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News