Kaluvai: ఏసీబీ వలలో పడిన ముగ్గురు ఇరిగేషన్ అధికారులు!
Kaluvai: కల్వర్టు ఎన్‌ఓసీ కోసం రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఈఈ మహేష్, డీఈ గౌతమ్ సుమన్, ఏఈ నారాయణ రాజు; ముగ్గురి అరెస్ట్.
Kaluvai: ఏసీబీ వలలో పడిన ముగ్గురు ఇరిగేషన్ అధికారులు!
Kaluvai: వర్షాలు లేక ఓవైపు పంటలు ఎండిపోతుంటే... కొంతమంది అవినీతి అధికారులు జలగల్లా పట్టుకుని రైతుల నెత్తురు తాగుతున్నారు.... రైతులకు అండగా నిలవాల్సిన నీటిపారుదల శాఖ అధికారులే... అవినీతికి పాల్పడుతూ, లంచావతారం ఎత్తిన ఓ ముగ్గురు అధికారులపై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది...
ఓ రైతు నుంచి మూడు లక్షలు రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, అవినీతి సొమ్ము స్వాదీనం చేసుకుంది.. ముగ్గురు అధికారులను అదుపులోకి తీసుకున్నారు ఏసీబి అధికారులు..పట్టుబడిన ఇరిగేషన్ శాఖ EE మహేష్ , DE గౌతమ్ సుమన్, AE M.నారాయణ రాజు లను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు...
కలువాయి మండలం మద్దూరిపల్లికి చెందిన అంబటి చిరంజీవి అనే రైతు తన పొలం వద్ద ఇరిగేషన్ కాలువపై కల్వర్టు నిర్మించుకునేందుకు NOC కోసం నాలుగు లక్షల డిమాండ్ చేశారు ఇరిగేషన్ శాఖ అధికారులు..చివరగా రైతు చిరంజీవి మూడు లక్షలు లంచం ఇస్తుండగా.. ఏసీబీ పన్నిన వలలో చిక్కుకున్నారు ఈ అవినీతి అధికారులు..