Nellore: రూరల్‌లో నిషేధిత (22-ఏ) భూములపై ప్రత్యేక రెవెన్యూ సదస్సు!

Nellore: రూరల్ ఎమ్మార్వో కార్యాలయంలో 22-ఏ నిషేధిత భూముల సమస్యలపై రెవెన్యూ సదస్సు టీడీపీ ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తహసీల్దార్ సుధీర్ దరఖాస్తులు స్వీకరణ

Update: 2026-08-27 08:33 GMT

Nellore: రూరల్‌లో నిషేధిత (22-ఏ) భూములపై ప్రత్యేక రెవెన్యూ సదస్సు!

Nellore: సొంత భూమి అయినప్పటికీ 22(ఏ) నిషేధిత భూముల జాబితాలో ఉండడం వల్ల అమ్మకానికి గాని, మార్పిడికి గాని వీలుకానందువల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల పరిస్థితులను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా రైతు సోదరులందరూ కూడా 22 (ఏ) భూముల మీద ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నిషేధిత భూముల జాబితా నుండి విముక్తి పొంది, శాశ్వత పరిష్కారం పొందే విధంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు (22ఏ) నిషేధిత భూ సమస్యలపై ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సు పెట్టి శాశ్వత పరిష్కారం దిశగా రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు, అర్హులైన రైతులకు 22(ఏ) జాబితా నుండి విముక్తి చేయడం జరుగుతుందని చెప్పారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని రైతు సోదరులందరూ కూడా భారీ ఎత్తున హాజరయ్యారు, ప్రతి గ్రామానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, తహసీల్దార్ గారిని, డిప్యూటీ తహసీల్దార్ , రెవెన్యూ ఇన్స్పెక్టర్ గని, వీఆర్వోలు, గ్రామాల పార్టీ నాయకులు అందరూ కలిసి గ్రామాలకు సంబంధించి దగ్గరుండి సమస్య పరిష్కరించే దిశగా ఒక మంచి నిర్ణయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, కావున 22 (ఏ) నిషేధిత భూముల సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యకు పరిష్కారం పొందవలసిందిగా తెలియజేస్తున్నామని అన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

ఈరోజు నిర్వహించిన ప్రత్యేక రెవెన్యూ సదస్సులో 22ఏ కి సంబంధించి వచ్చే అర్జీలపై ప్రత్యేక చొరవ తీసుకొని, ఖచ్చితంగా ప్రభుత్వ నియమనిబంధనలకు అనుగుణంగా ఉన్న 22(ఏ) ప్రకారం పేపర్లు ఎవరైతే అందచేస్తారో వారికి పూర్తిగా, 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి విముక్తి కలిగించేందుకు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం కృషి చేస్తుందని,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ లో 857 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.

ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

పై కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పల్లంరెడ్డి రవీంద్ర రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ అల్లాబక్షు, నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, నెల్లూరు ఏఎంసీ వైస్ చైర్మన్ రాపూరు శేఖర్, మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, క్లస్టర్ ఇంచార్జ్ సారంగం గున్నయ్య, శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్చార్జి వేమిరెడ్డి సురేందర్ రెడ్డి , రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News