Gudur: గూడూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతం!

గూడూరు: నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసాయి. ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా నిర్ణీత గడువులో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ నామినేషన్లను దాఖలు చేశారు.

నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. దీంతో నామినేషన్ల దాఖలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయి. ఇక తదుపరి ఎన్నికల ఘట్టాలపై రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు దృష్టి సారించారు.

Tags: