Gudur: ఎన్నికల అక్షరాస్యత క్లబ్ ఆధ్వర్యంలో వ్యాసరచన, క్విజ్ పోటీలు!
Gudur: నెల్లూరు జిల్లా గూడూరు డీఆర్డబ్ల్యూ జూనియర్ కళాశాలలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ఎన్నికల అక్షరాస్యత క్లబ్‌ల ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు.
Gudur: ఎన్నికల అక్షరాస్యత క్లబ్ ఆధ్వర్యంలో వ్యాసరచన, క్విజ్ పోటీలు!
గూడూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించడంతో పాటు ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాధాన్యత, బాధ్యతాయుతమైన ఓటింగ్‌పై చైతన్యం కల్పించేందుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ఎన్నికల అక్షరాస్యత క్లబ్‌ల (Electoral Literacy Clubs) ఆధ్వర్యంలో 2026 నవంబర్ 16వ తేదీన DRW జూనియర్ కళాశాలలో వ్యాసరచన మరియు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఎన్నికల ప్రక్రియ, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ఓటు హక్కు ప్రాముఖ్యత, ఎన్నికల్లో యువత పాత్ర, నైతిక ఓటింగ్ వంటి అంశాలపై పోటీలు నిర్వహించారు.
విద్యార్థుల్లో ఎన్నికలపై అవగాహన పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో బాధ్యతాయుతమైన ఓటర్లుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన కళాశాల ప్రిన్సిపల్ డి సత్యవతి గారు అధ్యాపకులు కే వెంకట రమణయ్య, కే రాజ్యలక్ష్మి, ఎస్ కే షకీలా భాను, కే కవిత, జె హారిక మరియు విద్యార్థులను అభినందించారు.