Nellore: కుల్లూరులో ఆంజనేయుడికి 108 కలశాలతో అభిషేకం
Nellore: నెల్లూరు జిల్లా కుల్లూరు గ్రామంలో 39 అడుగుల అభయ ఆంజనేయ స్వామికి హనుమజ్జయంతి వేడుకలు నిర్వహించారు.
Nellore: కుల్లూరులో ఆంజనేయుడికి 108 కలశాలతో అభిషేకం
నెల్లూరు జిల్లా: కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో ఆరామ మారుతి నిలయంలో హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి, మాజీ యం యల్ సి మాదాసు గంగాదరం, నలినమ్మ దంపతులు ఉభయకర్తలుగా 39 అడుగుల అభయ ఆంజనేయ స్వామికి పాలాభిషేకం, సహస్రనామార్చన, కుంకుమ పూజ, ఆకుపూజ కార్యక్రమాలు నిర్వహించారు, 108 కళశాలతో అభిషేకం చేశారు, అనంతరం భక్తులకు ప్రసాదం అందజేశారు,ఈ సందర్బంగా మాదాసు గంగాదరం మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఈ అభయ ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేసామని నేటికీ ప్రతి సంవత్సరం వేడుకగా హనుమజ్జయంతి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సుమారు 5వేలమంది భక్తులు దర్శించుకొంటారని అందరికి అన్నప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు,ఈ కార్యక్రమం లో మాదాసు యజ్ఞపవన్,అపర్ణ భక్తులు పాల్గొన్నారు.