Nellore: ఎస్పీ అజిత వెజెండ్ల దూకుడు.. నెల్లూరులో 30 వాహనాలు సీజ్!

Nellore: నెల్లూరు ఎస్పీ డా. అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.

Update: 2026-05-12 02:24 GMT

Nellore: ఎస్పీ అజిత వెజెండ్ల దూకుడు.. నెల్లూరులో 30 వాహనాలు సీజ్!

Nellore: నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల, జిల్లా పోలీస్ అధికారులకు కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లపై జారీ చేసిన ఆదేశాల మేరకు, జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల్లో భద్రతా భావన పెంపొందించే దిశగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్‌ను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. డిజిటల్ మ్యాపింగ్ ద్వారా క్రైమ్ స్పాట్స్ గుర్తింపు, రౌడీషీటర్లు, అనుమానితులు, పరారీ నిందితులు, NBWs/సమన్లు, గంజాయి మరియు ఇతర నిషేధిత పదార్థాలు, అనుమానాస్పద వాహనాలు మరియు అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ఈ ఆదేశాల మేరకు, అనగా తేది 11.05.2026న చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాకలి వీధి ప్రాంతంలో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది. ఈ కార్డన్ & సెర్చ్ కార్యక్రమం చిన్నబజార్ ఇన్‌చార్జి స్వామియే, మరియు సోమయ్య ఆధ్వర్యంలో నిర్వహించబడగా, చిన్నబజార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన నలుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లు మరియు 55 మంది పోలీసు సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా సుమారు 500 ఇళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

అలాగే స్థానిక ప్రజలకు, ముఖ్యంగా యువతకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, ఆరోగ్య మరియు సామాజిక సమస్యల గురించి పోలీసులు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, మత్తు పదార్థాల సరఫరా లేదా ఇతర అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇటువంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్‌ను విస్తృతంగా కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల తెలిపారు.

Tags:    

Similar News