Nellore: నెల్లూరులో బీజేపీ ‘మహిళా ఆక్రోశం’ ర్యాలీ!

Nellore: నెల్లూరులో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో 'మహిళా ఆక్రోశం' ర్యాలీ నిర్వహించారు.

Update: 2026-04-30 13:27 GMT

Nellore: నెల్లూరులో బీజేపీ ‘మహిళా ఆక్రోశం’ ర్యాలీ!

Nellore: ఈ రోజు (30-04-2026) సాయంత్రం బిజెపి జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిషిదా రాజు, ఉపాధ్యక్షురాలు కరణం సుభాషిని, జిల్లా అధ్యక్షులు చిలకల ప్రవీణారెడ్డి మరియు రాష్ట్ర మహిళా మోర్చా ఇంచార్జ్ సురేంద్ర రెడ్డి మహిళా ఆక్రోశం ర్యాలీని మహిళలందరితో కలిసి విఆర్సీ దగ్గర గల అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకొని, అక్కడ పాత్రికేయులతో అధ్యక్షురాలు నిషిదా రాజు మాట్లాడుతూ.

మన ప్రధాని మహిళలకు 33% రిజర్వేషన్ ఉండాలని చట్టసభలో బిల్లును ప్రవేశపెడితే, ఇండి కూటమి వ్యతిరేకించడం ఎంతో దారుణమని అని ఈ యొక్క మహిళా బిల్లు ఆమోదించే వరకు భారతదేశంలో మహిళలందరూ.. ఢిల్లీ నుంచి గల్లి వరకు, మహిళా బిల్లు కొరకు ఉద్యమించాలని , ఈ బిల్ ని అడ్డుకున్న మహిళా ద్రోహులను తరిమికొట్టాల్సిన ఆవశ్యకత ఉందని 33% ఇచ్చేంతవరకు పోరాటాన్ని ఆపమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరమ్మ, కమల, కవిత, నాగలక్ష్మి, స్వర్ణ, కారుణ్య, హారతి మరియు రత్నం నర్సింగ్ కాలేజీ మహిళలు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News