Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!
Dharmendra Pradhan: నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!
Dharmendra Pradhan Resigns: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరీక్షల అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.
నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు.
దేశంలో దాదాపు 150 రకాల పరీక్షల నిర్వహణలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడటం, నీట్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో ఆయనపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.
రాజీనామా అనంతరం ప్రధాన్ స్పందిస్తూ.. "దేశంలోని యువత, విద్యార్థుల ఆకాంక్షలను, వారి భావోద్వేగాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాను" అని ప్రకటించారు.
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు చేపట్టిన సుదీర్ఘ నిరసనలకు ఈ రాజీనామాతో పెద్ద విజయం లభించినట్లయింది.