Off The Record: తమిళ రాజకీయాల్లో కొత్త శకం..గెలుపే లక్ష్యంగా అడుగులు
Off The Record: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో శశికళ-PMK పొత్తు అన్నా డీఎంకే కొంప ముంచుతుందా? నటుడు విజయ్ టీవీకే పార్టీ ప్రభావం ఎంత?
Off The Record: తమిళ రాజకీయాల్లో కొత్త శకం..గెలుపే లక్ష్యంగా అడుగులు
చెన్నై/బ్యూరో: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రం మునుపెన్నడూ లేని విధంగా ఆసక్తికర పరిణామాలకు వేదికవుతోంది. ఒకవైపు అధికారాన్ని నిలబెట్టుకోవాలని డీఎంకే (DMK), మరోవైపు ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ-అన్నా డీఎంకే (NDA) కూటమి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అయితే, ఈ సమీకరణాలను తలకిందులు చేసేలా శశికళ కొత్త కూటమిని తెరపైకి తెచ్చారు.
అన్నా డీఎంకే నుండి బహిష్కరణకు గురైన శశికళ, తనను వేధించిన పళనిస్వామి (EPS)పై పగ తీర్చుకోవడమే లక్ష్యంగా 'ఆల్ ఇండియా తలైవర్ మక్కల్ మున్నెట్ర కజగం' పార్టీని స్థాపించారు. తాజాగా రామదాస్ నేతృత్వంలోని PMKతో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా తేవర్ మరియు వన్నియర్ సామాజిక వర్గాలను ఏకం చేశారు. ఈ రెండు సామాజిక వర్గాల కలయిక సుమారు 100 నియోజకవర్గాల్లో అన్నా డీఎంకే ఓటు బ్యాంకును భారీగా దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది పరోక్షంగా అధికార డీఎంకేకు లాభం చేకూర్చేలా కనిపిస్తోంది.