Off The Record: తెలంగాణలో మోదీ టూర్

Off The Record: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభను నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.

Update: 2026-03-23 10:30 GMT

Off The Record: తెలంగాణలో మోదీ టూర్

హైదరాబాద్: త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హైదరాబాద్‌కు కూడా రానున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో, మూడు మేయర్ పీఠాలను దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సభ ద్వారా కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపాలని కమలనాథులు భావిస్తున్నారు. 


Full View


Tags:    

Similar News