Divorce: విడాకుల కోసం కోర్టుకెళ్లిన జంట.. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!
Divorce: విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన ఓ దంపతుల జీవితంలో సినిమాని మించిన ట్విస్ట్ చోటుచేసుకుంది.
Divorce: విడాకుల కోసం కోర్టుకెళ్లిన జంట.. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!
Delhi Court: జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరు ఎప్పుడు ఎవరికి ప్రాణదాతగా మారుతారో ఎవరూ ఊహించలేరు. సరిగ్గా ఇదే సూత్రం విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన ఓ దంపతుల జీవితంలో నిజమైంది. అహంకారాలు, మనస్పర్థలతో విడిపోయి, ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడని ఆ భార్యాభర్తలు.. చివరకు అదే కోర్టు ప్రాంగణంలో ఒకరినొకరు గట్టిగా హత్తుకుని ఏడ్చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ హృదయ విదారక, మైండ్ బ్లోయింగ్ రియల్ లైఫ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఢిల్లీకి చెందిన శిఖ సింగ్, సౌరభ్‌లకు 2020లో ఎంతో వైభవంగా వివాహం జరిగింది. ఎన్నో కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ జంట మధ్య, పెళ్లైన కొద్దిరోజులకే విభేదాలు తలెత్తాయి. చిన్న చిన్న గొడవలు కాస్తా పెద్దవై ఇద్దరూ ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఈ క్రమంలోనే భర్త సౌరభ్‌పై భార్య శిఖ సింగ్ వరకట్న వేధింపుల కేసు పెట్టింది. విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. కూతురు జీవితం ఇలా అయిపోయిందే అని బాధపడుతూ, కోర్టుల చుట్టూ తిరగడానికి శిఖ తండ్రి భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.ఆర్థిక ఇబ్బందులు, కూతురి భవిష్యత్తు గురించిన తీవ్ర మానసిక ఆందోళనల మధ్య శిఖ తండ్రికి అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అసలే చేతిలో పైసా లేని స్థితి.. ఏం చేయాలో పాలుపోక శిఖ కుటుంబ సభ్యులు ఆయన్ను ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
కుటుంబం మొత్తం దిక్కుతోచని స్థితిలో, కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తమపై కేసు పెట్టి, విడాకులకు సిద్ధమైన మామగారికి గుండెపోటు వచ్చిందని, పరిస్థితి విషమంగా ఉందని సౌరభ్‌కు తెలిసింది. సాధారణంగా అయితే చాలామంది ఈ సమయంలో పగ ప్రతీకారాలు చూసుకుంటారు. కానీ సౌరభ్ అలా చేయలేదు. శత్రుత్వాన్ని, కోర్టు కేసులను పక్కనబెట్టి తక్షణమే ఆసుపత్రికి పరుగెత్తుకొచ్చాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో మామగారి దయనీయ స్థితిని చూసి చలించిపోయాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా, తన సొంత డబ్బులతో ఆయన్ను ఒక కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. డాక్టర్లతో మాట్లాడి, స్వయంగా దగ్గరుండి మెరుగైన వైద్యం చేయించి, తన మామగారి ప్రాణాలను కాపాడాడు.
భర్త చేసిన ఈ గొప్ప సాయం, చూపించిన మానవత్వం శిఖ మనసును పూర్తిగా మార్చేసింది. కోపాలు, అహాలు కరిగిపోయాయి. తమ మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదో ఇద్దరికీ అర్థమైంది. కాగా, ఇటీవల ఢిల్లీ కోర్టులో వీరి విడాకుల కేసుకు సంబంధించిన తదుపరి విచారణ జరిగింది. విచారణకు ఇద్దరూ హాజరయ్యారు.కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. జడ్జి ముందు నిలబడిన ఆ ఇద్దరూ విడాకుల పత్రాలపై సంతకాలు చేయడానికి బదులు.. ఒకరినొకరు గట్టిగా అలింగనం చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చేశారు. పాత పగలు, గొడవలను మరిచిపోయి ఇకపై కలిసే ఉంటామని కోర్టు సాక్షిగా ప్రమాణం చేశారు.
కోర్టు రూమ్ బయట ఈ జంట భావోద్వేగంతో హత్తుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, సినిమా స్టోరీని మించిన రియల్ లైఫ్ డ్రామా ఇది.. సౌరభ్ లాంటి భర్త దొరకడం శిఖ అదృష్టం, ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. విడిపోవడానికి కారణాలు వెతికే ఈ రోజుల్లో.. కలవడానికి ఒక చిన్న అవకాశం వస్తే చాలు బంధాలు మళ్లీ చిగురిస్తాయని ఈ ఢిల్లీ జంట నిరూపించింది.