Anil Vij: దాన్ని చూస్తే చిన్నపిల్లవాడు కూడా చెప్పుతో నలిపేస్తాడు.. ‘కాక్రోచ్ పార్టీ’పై అనిల్ విజ్ సెటైర్లు!
Anil Vij: సోషల్ మీడియా సెన్సేషన్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నీట్ పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టింది.
Anil Vij: దాన్ని చూస్తే చిన్నపిల్లవాడు కూడా చెప్పుతో నలిపేస్తాడు.. ‘కాక్రోచ్ పార్టీ’పై అనిల్ విజ్ సెటైర్లు!
Anil Vij: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ‘నీట్’ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంపై సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ (CJP) శనివారం ఢిల్లీలోని చారిత్రాత్మక జంతర్ మంతర్ వేదికగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. నీట్ పరీక్షల అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ.. జంతర్ మంతర్ వద్ద తాము చేపట్టిన ఈ నిరసన కేవలం ఒక ‘ట్రైలర్’ మాత్రమేనని, విద్యార్థుల భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో తమ ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చుతుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలపై హర్యానా ఇంధన శాఖ మంత్రి అనిల్ విజ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ (ట్విట్టర్) లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. "భారత ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు, తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. కానీ, వారు ముందుగా తమ పార్టీ పేరు మార్చుకోవాలి" అని అనిల్ విజ్ సలహా ఇచ్చారు.
"బొద్దింక (కాక్రోచ్) అనేది చాలా అసహ్యకరమైన కీటకం. దాన్ని ఇంట్లో చూస్తే చిన్నపిల్లవాడు కూడా చెప్పుతో నలిపేస్తాడు. అలాంటి బొద్దింక వంటి వింత పేరును పెట్టుకుని రాజకీయాలు చేయడం, నిరసనలు తెలపడం అస్సలు మంచిది కాదు" అంటూ అనిల్ విజ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నీట్ వివాదంపై ఒకవైపు సీజేపీ ఉద్యమం, మరోవైపు హర్యానా మంత్రి కౌంటర్లతో సోషల్ మీడియాలో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.