Huzurnagar: అణిచివేత ప్రభుత్వాలకు కొత్త తరాల ఉద్యమాలే సవాలు: అందె సత్యం!
Huzurnagar: హుజూర్‌నగర్‌లో స్పందన వేదిక వ్యవస్థాపకుడు కాకి పరాబ్ కుమార్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
Huzurnagar: అణిచివేత ప్రభుత్వాలకు కొత్త తరాల ఉద్యమాలే సవాలు: అందె సత్యం!
హుజూర్ నగర్: హుజూర్ నగర్ లో స్పందన సామాజిక అధ్యయన వేదిక నిర్వాహకులుగా ఉండి, డిస్ట్రిక్ట్ ఫార్మసీ ఆఫీసర్ గా ఉద్యోగ విరమణ చేసిన కాకి పరాబ్ కుమార్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ నిబద్ధతతో కూడిన ఆచరణతో స్పందన సంస్థ పట్టణంలోని అన్నివర్గాల ఆదరణ పొందిందని అన్నారు.
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట అధ్యక్షుడు అంబటి నాగన్న మాట్లాడుతూ సమాజం మానవీయంగా పురోగమించడానికి ప్రేమ ఒక ప్రేరణగా,ప్రశ్న ఒక సాధనం గా నిలిచాయని,వాటిని కాపాడుకోవడం మనముందున్న కర్తవ్యం అని అన్నారు.డా.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నిబద్ధతగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే సామాజిక కార్యక్రమాలలో తనదైన ప్రత్యేకత నిలబెట్టుకున్నందుకు పరాబ్ కుమార్ అభినందనీయుడని అన్నారు.
మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ మాట్లాడుతూ మోడల్ రోడ్ ,టౌన్ హాల్ వంటి నిర్మాణాత్మక కార్యక్రమాల లో అందరినీ కలుపుకుని ముందుకెళ్లడంలో స్పందన సంస్థ విజయం సాధించించిందని,ఇక ముందు కూడా అలాంటి కార్యక్రమాలకు మా వంతు సహకారం అందిస్తామని అన్నారు.జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి డా.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సభలో వచ్చిన సూచనల మేరకు వైద్య సేవల మెరుగుదలకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇంకా పలు ఉపాధ్యాయ, ఉద్యోగ,సాంస్కృతిక సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని హుజూర్ నగర్ ప్రభుత్వ వైద్య శాలలో సుదీర్ఘ కాలం ఫార్మసిస్ట్ గా పరాబ్ కుమార్ అందించిన సేవలను,స్పందన సంస్థ ద్వారా చేపట్టిన సామాజిక,సాంస్కృతిక,నిర్మాణాత్మక కార్యక్రమాల లో ఆయన పాత్రను అభినందించారు.అనంతరం పరాబ్ కుమార్ మాట్లాడుతూ ఆందోళనకరంగా మారుతున్న సామాజిక వాస్తవాలను మంచి దిశగా మళ్లించడం ప్రతి పౌరుడి బాధ్యత అని,అన్ని వర్గాల ఆదరణ తోనే స్పందన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాయని అన్నారు.పలువురు కళాకారులు తమ ప్రబోధాత్మక గీతాలతో అలరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాముల శివారెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లిఖార్జున్ ,పల్లె వెంకట్ రెడ్డి,కొప్పుల సైది రెడ్డి,మేకల నాగేశ్వర్ రావు,కంబాల శ్రీనివాస్,హరి బాబు, కాకి అజయ్, ఎమ్.వెంకటేశ్వర్లు,దుర్గా ప్రసాద్, కె వి.సత్యనారాయణ, ఆర్.శ్రీనివాస్,శాంతి, తదితరులు పాల్గొన్నారు.