Nalgonda: పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగొద్దు: నల్గొండ కలెక్టర్!
Nalgonda: నల్గొండ జిల్లాలో పత్తి కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. క్వింటా పత్తి మద్దతు ధర రూ.8,867కు పెంచినట్లు తెలిపారు.
Nalgonda: పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగొద్దు: నల్గొండ కలెక్టర్!
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సమర్థమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం తన చాంబర్‌లో సీసీఐ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో 2026-27 ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ ఏడాది క్వింటా పత్తి మద్దతు ధరను ₹8,100 నుంచి ₹8,867కు (₹767 పెంపు) పెంచినట్లు తెలిపారు.