Nalgonda: కేతపల్లి వద్ద పార్సల్ లారీలో భారీ అగ్నిప్రమాదం.. కాలిపోయిన సరుకు!

Nalgonda: నల్గొండ జిల్లా కేతపల్లి సమీపంలో ఘోర అగ్నిప్రమాదం. పార్సల్ లోడుతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. ​డ్రైవర్ అప్రమత్తతతో రోడ్డు పక్కన లారీ నిలపడంతో తప్పిన పెను ప్రమాదం. ​అగ్నికీలల ధాటికి లారీలోని పార్సల్స్ మొత్తం పూర్తిగా దగ్ధం.

​ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్. ​సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు.

​పార్సల్స్ కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. లారీలో మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్న అధికారులు. ​కేతపల్లి లారీ అగ్నిప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: