Nalgonda: అవినీతి ఆర్ఐ భాగోతం.. లంచాల రేట్ కార్డ్ చూస్తే షాకే!

Nalgonda: నల్లగొండ జిల్లా శాలిగౌరారం ఆర్ఐ రఫీ అవినీతి అక్రమాలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

Update: 2026-07-19 11:51 GMT

Nalgonda: అవినీతి ఆర్ఐ భాగోతం.. లంచాల రేట్ కార్డ్ చూస్తే షాకే!

నల్గొండ: శాలిగౌరారం ఆర్ఐ రఫీ డబ్బుల గురించి ఓ రైతు తో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్.నేనిచ్చే రిపోర్టును బట్టే నీకు పని అంటూ రైతులను బెదిరిస్తున్న ఆర్ఐ.సామాన్యు రైతుల నుండి ఆర్ఐ ముక్కుపిండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని రైతుల ఆరోపణ.

​ఆదాయ ధృవీకరణ పత్రం రూ.500.. కళ్యాణ లక్ష్మి రూ.5000.. రేషన్ కార్డుకు రూ.1500.. ఇది ఆర్ఐ రఫీ 'లంచాల రేటు కార్డు'.​భూ రీ-సర్వేలో అక్రమాలకు తెర.. పైసలిస్తే రికార్డులు.. లేదంటే ఫైళ్లు గల్లంతు చేస్తున్నాడని రైతుల ఆరోపణలు.​వారం రోజుల క్రితం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన రైతులు..

రఫీని వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేసిన రైతులు.​అవినీతి ఆర్ఐ రఫీని విధుల నుంచి తొలగించాలని కలెక్టర్, ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చిన రైతులు.​ "నాకు పై అధికారుల అండ ఉంది. మీ పాస్ బుక్కులు రద్దు చేయిస్తా" అంటూ భయపెడుతున్నాడని రైతుల ఆరోపణ.

రైతులను ఇబ్బందికి గురి చేస్తున్న ఆర్ఐ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్.

Tags:    

Similar News