Nalgonda: ఐకాన్ ఆసుపత్రి దారుణాలు: అధికారుల తనిఖీలతో డొల్లతనం బహిర్గతం!

Nalgonda: రోగి మృతి చెందిన తర్వాత కూడా లక్షల రూపాయల బిల్లు వసూలు చేశారంటూ బాధితులు డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద కన్నీరు మున్నీరయ్యారు.

Update: 2026-08-12 17:25 GMT

Nalgonda: ఐకాన్ ఆసుపత్రి దారుణాలు: అధికారుల తనిఖీలతో డొల్లతనం బహిర్గతం!

నల్లగొండ: పట్టణంలోని ఐకాన్ ఆసుపత్రి అక్రమాలు, వైద్య నిర్లక్ష్యం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ (DMHO) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలతో ఆసుపత్రి డొల్లతనం బహిర్గతమైంది. అధికారుల రాకతో ఇప్పటివరకు అన్యాయానికి గురైన బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.

​బుధవారం ఉదయం నుంచే బాధితులు, మృతుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో డిఎంహెచ్ఓ కార్యాలయానికి చేరుకుని ఐకాన్ హాస్పిటల్‌పై ఫిర్యాదుల వర్షం కురిపించారు. 'ఠాగూర్' సినిమాను తలపించేలా.. రోగి మరణించినా విషయం దాచిపెట్టి మెడిసిన్ తెప్పించారని, ఆస్తులు అమ్మి రూ. 9 లక్షల బిల్లు కట్టించుకున్నాకే చనిపోయాడని చెప్పారని ఓ బాధితుడు కన్నీరుమున్నీరయ్యారు.

​కేవలం జలుబు, జ్వరంతో ఆసుపత్రికి వస్తే తొమ్మిది రోజుల పాటు నాన్చి, డబ్బుల కోసమే ప్రాణాలు తీశారని ఆరోపించారు. నిరుపేదల రక్తం పిండుతున్న ఐకాన్ ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేసి, తమకు న్యాయం చేయాలని, మరణించిన తమ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News