Kodad: కోదాడ ఘోర ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి ఆవేదన!
Kodad: కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Kodad: కోదాడ ఘోర ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి ఆవేదన!
Kodad: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కంటైనర్‌ను ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులు మృతిచెందడం హృదయవిదారకమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు