Nalgonda: నల్గొండలో చిరుత కలకలం.. అసలు నిజం ఇది!

Nalgonda: ఏఆర్ నగర్‌లో చిరుత తిరుగుతోందంటూ వైరల్ అయిన వీడియోపై అటవీశాఖ క్లారిటీ ఇచ్చింది. అది చిరుత కాదని, అడవి పిల్లి (సివెట్ క్యాట్) అని స్పష్టం చేసింది.

Update: 2026-07-23 06:24 GMT

Nalgonda: నల్గొండలో చిరుత కలకలం.. అసలు నిజం ఇది!

నల్గొండలో: చిరుత కలకలం.. అడవి పిల్లిగా నిర్ధారణ!

​నల్గొండలోని ఏఆర్ నగర్‌లో అర్ధరాత్రి చిరుత పిల్ల సంచరిస్తోందంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఆ వీడియోలో ఉన్నది చిరుత కాదని, అడవి పిల్లి (సివెట్ క్యాట్) అని రేంజ్ అధికారి వీరేంద్ర బాబు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మి ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News