Miryalaguda: మిర్యాలగూడలో నేడు బీఆర్‌ఎస్ భారీ మహాధర్నా!

Miryalaguda: కృష్ణా జలాల అక్రమ తరలింపును నిరసిస్తూ మిర్యాలగూడ ఎన్‌ఎస్‌పీ గ్రౌండ్‌లో బీఆర్‌ఎస్ మహాధర్నా చేపట్టనుంది.

Update: 2026-09-03 08:41 GMT

Miryalaguda: మిర్యాలగూడలో నేడు బీఆర్‌ఎస్ భారీ మహాధర్నా!

Miryalaguda: కృష్ణా జలాల అక్రమ తరలింపును అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా నేడు మిర్యాలగూడలో బీఆర్‌ఎస్‌ భారీ మహాధర్నాకు పిలుపునిచ్చింది.

​మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు నేతృత్వంలో పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంప్ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ నిరసన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మహాధర్నాకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ఎన్ఎస్పీ గ్రౌండ్‌లో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.

Tags:    

Similar News