Nalgonda: ఈనెల 5న నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!
Nalgonda: ఈనెల 5న నల్గొండ జిల్లా నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. కలెక్టర్ సీరియస్ ఆదేశాలు.
Nalgonda: ఈనెల 5న నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!
Nalgonda: రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి ఈనెల 5న నల్గొండ జిల్లా నకిరేకల్‌లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొననుండటంతో అవసరమైన అన్ని ఏర్పాట్లనూ పక్కాగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.సీఎం 5వ తేదీన హెలికాప్టర్ ద్వారా నకిరేకల్ చేరుకుంటారని వెల్లడించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని పేర్కొన్నారు.