Nalgonda: నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా మారుస్తా మంత్రి కోమటిరెడ్డి!
Nalgonda: నల్లగొండను అభివృద్ధి చేయడమే నా జీవిత లక్ష్యం. ₹125 కోట్లతో తాగునీటి ప్రాజెక్ట్, 2028 నాటికి SLBC సొరంగం పూర్తి అని మంత్రి కోమటిరెడ్డి వెల్లడి.
Nalgonda: నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా మారుస్తా మంత్రి కోమటిరెడ్డి!
Nalgonda: నల్లగొండ పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండ క్లబ్‌లో 2కోట్ల రూపాయలతో నిర్మించిన అదనపు గదులు, కాన్ఫరెన్స్ హాల్‌ను మంత్రి ప్రారంభించారు.
క్లబ్ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ప్రజలకు 24 గంటల తాగునీరు అందించేందుకు 125 కోట్లతో పనులు చేపట్టడం జరిగిందని, ఆరు నెలల్లో పనులు పూర్తిచేస్తామన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పూర్తి చేయడం తన ప్రధాన లక్ష్యాల్లో ఒకటని, సీఎం ఇచ్చిన హామీ మేరకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో నిధులు సమకూర్చుకుని పనులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
ఆగస్టు 2028 నాటికి సొరంగ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కోమటిరెడ్డి చెప్పారు.