Nalgonda: హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ.. త్రివర్ణ పతాకాలతో హోరెత్తిన పట్టణం!

Nalgonda: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నల్గొండలో బీజేపీ ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ జరిగింది. బీజేపీ రాష్ట్ర నేత పాలకూరి రవి గౌడ్ పాల్గొన్నారు.

Update: 2026-08-14 16:44 GMT

Nalgonda: హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ.. త్రివర్ణ పతాకాలతో హోరెత్తిన పట్టణం!

నల్లగొండ: భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం నల్గొండ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో “హర్ ఘర్ తిరంగా – హర్ దిల్ తిరంగా” ర్యాలీ అంగరంగ వైభవంగా సాగింది. చేతుల్లో త్రివర్ణ పతాకాలు చేబూని నాయకులు, కార్యకర్తలు, యువత దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీగా తరలివచ్చారు.

​ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు పాలకూరి రవి గౌడ్ మాట్లాడుతూ.. జాతీయ జెండా మన దేశ ఐక్యతకు, సార్వభౌమాధికారానికి ప్రతీక అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు.

Tags:    

Similar News