Wuthering Heights : ప్రేమ.. పగ.. ప్రతీకారం.. ఓటీటీలోకి వచ్చేసిన క్లాసిక్ లవ్ స్టోరీ.!

Wuthering Heights : పీరియడ్ డ్రామాలను, ఎమోషనల్ కథలను ఇష్టపడే సినీ ప్రేక్షకులకు ఇది నిజంగా అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన క్లాసిక్ నవల

Update: 2026-05-04 12:58 GMT

Wuthering Heights

Wuthering Heights : పీరియడ్ డ్రామాలను, ఎమోషనల్ కథలను ఇష్టపడే సినీ ప్రేక్షకులకు ఇది నిజంగా అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన క్లాసిక్ నవల 'వుదరింగ్ హైట్స్' (Wuthering Heights) ఆధారంగా తెరకెక్కిన తాజా సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో సందడి చేస్తోంది. హాలీవుడ్ స్టార్స్ మార్గోట్ రాబీ, జాకబ్ ఎలోర్డీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిన తర్వాత ఇప్పుడు నేరుగా మీ మొబైల్ స్క్రీన్స్ పైకి వచ్చేసింది. కేవలం ప్రేమ మాత్రమే కాకుండా వ్యామోహం, ప్రతీకారం వంటి డార్క్ ఎమోషన్స్ ను ఈ సినిమాలో సరికొత్తగా చూపించారు.

బ్యాక్ డ్రాప్‌లో ఇంటెన్స్ స్టోరీ

ఈ సినిమా కథ మొత్తం యోక్షైర్ మూర్స్ (Yorkshire moors) చుట్టూనే సాగుతుంది. ఒక భయంకరమైన, అదే సమయంలో మనసును హత్తుకునే భావోద్వేగభరితమైన ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లే ఈ చిత్రం, వర్గ విభజన , మానసిక వేదన వంటి అంశాలను టచ్ చేస్తుంది. కేవలం ఇద్దరి మధ్య ప్రేమతోనే ఆగిపోకుండా, ఆ ప్రేమ వల్ల కలిగే పరిణామాలు తర్వాతి తరాలపై ఎలా పడతాయో ఈ సినిమాలో క్లియర్ గా చూపించారు. ఈ చిత్రం జనవరి 28, 2026న లాస్ ఏంజిల్స్‌లోని గ్రామన్ చైనీస్ థియేటర్‌లో గ్రాండ్ గా ప్రీమియర్ జరుపుకుంది, ఆ తర్వాత ఫిబ్రవరి 13, 2026న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది.

ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది.?

ప్రస్తుతం 'వుదరింగ్ హైట్స్' సినిమా ఇంటర్నేషనల్ గా HBO Max లో అందుబాటులో ఉంది. ఇక మన భారతీయ ప్రేక్షకుల విషయానికి వస్తే, ఈ అద్భుతమైన పీరియడ్ డ్రామాను JioHotstar ఓటీటీ వేదికగా వీక్షించవచ్చు. లాంగ్ వీకెండ్ లేదా రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు ఈ క్లాసిక్ స్టోరీని మీ ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయడం బెస్ట్ ఛాయిస్.

హీత్‌క్లిఫ్ - కేథరీన్ ల బంధం

ఈ కథ ప్రధానంగా హీత్‌క్లిఫ్ , కేథరీన్ ఎర్న్‌షా మధ్య ఉండే ఒక ట్రాజిక్ రిలేషన్ షిప్ చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వీరిద్దరి మధ్య ఉన్న స్ట్రాంగ్ బాండింగ్, కాలక్రమేణా ఒక బిగ్ ట్విస్ట్ తీసుకుంటుంది. కేథరీన్ తన మనసులో ఉన్న హీత్‌క్లిఫ్ ను కాదని, రిచ్ గా ఉండే ఎడ్గార్ లింటన్‌ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన హీత్‌క్లిఫ్, ఆ అవమానంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ కొన్నేళ్ల తర్వాత భారీ సంపదతో తిరిగి వచ్చి, తనను బాధపెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. ఈ పగ, గర్వం వల్ల వారి జీవితాలే కాకుండా చుట్టుపక్కల వారు కూడా ఎలా ఇబ్బందులు పడ్డారో ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు.

నటీనటులు , టెక్నీషియన్స్

ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ఎమరాల్డ్ ఫెన్నెల్ డైరెక్ట్ చేశారు. ఎమరాల్డ్ తో పాటు జోసీ మెక్‌నమరా, మార్గోట్ రాబీ స్వయంగా ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. కేథరీన్ ఎర్న్‌షా పాత్రలో మార్గోట్ రాబీ తన నటనతో మెప్పించగా, హీత్‌క్లిఫ్ పాత్రలో జాకబ్ ఎలోర్డీ నటించారు. వీరిద్దరితో పాటు నెల్లీ డీన్‌గా హాంగ్ చౌ, సిస్టర్ మెర్సీగా విక్కీ పెప్పర్‌డైన్, జోసెఫ్‌గా ఇవాన్ మిచెల్ కీలక పాత్రల్లో నటించారు. లక్కీచాప్ ఎంటర్టైన్మెంట్, MRC , లై స్టిల్ సంస్థలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను నిర్మించాయి. ఒక గొప్ప క్లాసిక్ నవలకు వెండితెర రూపమే ఈ సినిమా.


Tags:    

Similar News