Dragon Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
Dragon Movie:గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్‌గా వచ్చిన ‘డ్రాగన్’ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Dragon Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
NTR : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న మేకర్స్ విడుదల చేసిన ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. యూట్యూబ్‌లో రికార్డుల వేట మొదలుపెట్టిన ఈ గ్లింప్స్, నందమూరి అభిమానులకు అసలైన పూనకాలు తెప్పించింది. దాదాపు 4 నిమిషాలకు పైగా సాగిన ఈ సుదీర్ఘ గ్లింప్స్‌తోనే మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా కథ ఏంటో విజువల్‌గా చెప్పేశారు.
డ్రాగన్ కథేంటంటే..
‘ఒపియమ్’ అనే మత్తు మొక్క.. దాని ద్వారా తయారయ్యే హెరాయిన్.. దీని చుట్టూ నడిచే అంతర్జాతీయ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా సాగనుందని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. సినిమాలో లూగెర్‌గా ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్, ఆయన పలికిన పవర్‌ఫుల్ డైలాగ్స్ థియేటర్లలో రీసౌండ్ గ్యారెంటీ అనేలా ఉన్నాయి. అయితే ఈ గ్లింప్స్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే.. సినిమాలో ఏకంగా ఎనిమిది మంది విలన్లను చూపించడం.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాదు.. ఏకంగా హాలీవుడ్ నటీనటులను కూడా విలన్లుగా రంగంలోకి దించుతున్నారు నీల్. అశుతోష్ రాణా, అనిల్ కపూర్, బిజు మేనన్, అన్షుమాన్ పుష్కర్, సిద్ధాంత్ గుప్తా, గురు సోమసుందరం, బిమల్ జీత్ ఒబెరాయ్‌లతో పాటు రష్యన్ నటుడు అలెగ్జాండర్ విజేవ్, బ్రిటిష్ నటుడు బెన్డిక్ట్ గారెట్, సౌతాఫ్రికా యాక్టర్ తుతేలో ప్రిన్స్ గ్రాట్ బూమ్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తోంది. ఇక ‘కాంతారా’ ఫేమ్ రుక్మీణీ వసంత్ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇంతటి భారీ మైలురాయి లాంటి ప్రాజెక్టులో టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో నచ్చిన మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ కూడా నటించాల్సి ఉంది. కానీ ఆయన డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. దీనిపై కొన్ని రోజుల క్రితం టొవినో స్వయంగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా మలయాళ సినిమాలు ఒకే షెడ్యూల్‌లో లేదా మూడు నెలల్లో పూర్తవుతాయి. కానీ తెలుగులో ఇలాంటి భారీ ప్రాజెక్టుల కోసం ఏడాది పొడవునా వేర్వేరు సమయాల్లో డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. షెడ్యూల్స్ ఎప్పుడు ఉంటాయో తెలియదు. నాకు ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమా చేయడం అలవాటు. ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం నాకు నచ్చదు. ‘డ్రాగన్’ సినిమా కోసమే ఏడాది పాటు సమయం కేటాయిస్తే నా మలయాళ సినిమాలపై దెబ్బ పడుతుంది. అక్కడ నా కమిట్‌మెంట్లను బ్రేక్ చేయడం ఇష్టం లేకే ఎన్టీఆర్ - నీల్ సినిమాను వదులుకున్నా" అని టొవినో చెప్పుకొచ్చాడు.
ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం.. ‘డ్రాగన్’ సినిమాలో ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీలో వాజిర్ అయిన ‘బాబీ సర్కార్’ అనే అత్యంత కీలకమైన పాత్ర కోసం మొదట టొవినో థామస్‌ను సంప్రదించారట. అయితే ఆయన నో చెప్పడంతో, ఆ పాత్ర ఇప్పుడు బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ గుప్తా చేతికి వెళ్ళింది. సినిమాలో ఈ బాబీ సర్కార్, లూగెర్ ఇద్దరూ అన్నదమ్ములుగా కనిపించనున్నారనే సరికొత్త వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ టొవినో థామస్ ఈ ప్రాజెక్టులో ఉండి ఉంటే స్క్రీన్ ప్రెజెన్స్ మరో రేంజ్‌లో ఉండేదని, కానీ ఒక మంచి అవకాశాన్ని ఆయన చేజేతులా మిస్ చేసుకున్నాడని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ ‘డ్రాగన్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.