Ram Charan: రామ్ చరణ్‌పై దారుణంగా ట్రోల్స్.. అన్న ఆ స్టెప్ నిజంగా నువ్వే వేసావా అంటూ
Ram Charan: రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబోలో వస్తున్న "పెద్ది" సినిమా ట్రైలర్ లాంచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
Ram Charan: రామ్ చరణ్‌పై దారుణంగా ట్రోల్స్.. అన్న ఆ స్టెప్ నిజంగా నువ్వే వేసావా అంటూ
Peddi Trailer : 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా "పెద్ది". బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో చిత్ర యూనిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ట్రైలర్ విషయానికి వస్తే.. రామ్ చరణ్ ఇందులో క్రికెట్, రన్నింగ్, కుస్తీలలో చెడుగుడు ఆడే రగ్గడ్ లోకల్ అథ్లెట్ 'పెద్ది'గా మునుపెన్నడూ చూడని మాస్ విశ్వరూపం చూపించారు. ఏఆర్ రెహమాన్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ సినిమాపై హైప్‌ను ఆకాశానికి తీసుకెళ్లాయి.
ట్రోలర్లకు దొరికిన మెటీరియల్
ట్రైలర్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయినప్పటికీ, వేదికపై జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈవెంట్‌లో అభిమానులు, మీడియా ప్రతినిధుల కోరిక మేరకు రామ్ చరణ్ వేదికపైనే 'చికిరి చికిరి' పాటకు సంబంధించిన హుక్ స్టెప్పులు వేశారు. అయితే, సడన్‌గా అడిగేసరికి రామ్ చరణ్ ఆ హుక్ స్టెప్ వేసే క్రమంలో మొదట కొద్దిగా తడబడ్డారు. ఆ తర్వాత వెంటనే లయ అందుకుని తన మార్క్ గ్రేస్‌తో ఇరగదీశారు. కానీ, యాంటీ ఫ్యాన్స్ , కొందరు నెటిజన్లు ఆ మొదట తడబడిన కొన్ని సెకన్ల వీడియో క్లిప్‌ను మాత్రమే కట్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ దారుణంగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. చరణ్ డాన్స్ స్టెప్ మర్చిపోయాడు ,ఇబ్బంది పడుతున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
నిజానికి ఈ ట్రోల్స్‌కు బదులిచ్చేలా ఈవెంట్‌లోనే రామ్ చరణ్ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. జాన్వీ కపూర్ డెడికేషన్ గురించి మాట్లాడుతూ.. తాము ఏకధాటిగా 85 రోజుల పాటు షూటింగ్ చేశామని, చివరి రోజున డైరెక్ట్ గా సాంగ్ షూట్‌కు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. షూటింగ్ బిజీ వల్ల నాకు ఆ లాస్ట్ సాంగ్ ప్రాక్టీస్ చేయడానికి అస్సలు టైమ్ దొరకలేదు. నేను స్పాట్‌కి వెళ్లి అక్కడికక్కడే మూవ్‌మెంట్స్ నేర్చుకుని డాన్స్ చేశాను. కానీ జాన్వీ మాత్రం ముందే తన మొబైల్‌లో చూస్తూ సీక్రెట్‌గా స్టెప్స్ అన్నీ ప్రాక్టీస్ చేసేసుకుంది. ఆ పాటలో నాకంటే 100 రెట్లు తనే బాగా డాన్స్ చేసింది. ఆమె డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేయడానికి సిద్ధమవుతున్న ఈ పెద్ది పెహల్వాన్ జూన్ 4న థియేటర్లలో ఎలాంటి రచ్చ లేపుతాడో చూడాలి.