Dragon Glimpse: ఎన్టీఆర్ మాస్ విశ్వరూపం..మాములుగా లేదుగా..!
Dragon Glimpse: యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో 'డ్రాగన్' అఫీషియల్ గ్లింప్స్ విడుదల.
Dragon Glimpse: ఎన్టీఆర్ మాస్ విశ్వరూపం..మాములుగా లేదుగా..!
NTR: టాలీవుడ్ మోస్ట్ పవర్‌ఫుల్ కాంబినేషన్లలో ఒకటైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్‌గా విడుదలైన 'డ్రాగన్' గ్లింప్స్ సోషల్ మీడియాలో రికార్డులను తిరగరాస్తోంది. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ థీమ్, మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎన్టీఆర్ మునుపెన్నడూ చూడని మాస్ లుక్.. వెరసి ఈ గ్లింప్స్ అభిమానులకు అసలైన ఐ ఫీస్ట్‌లా నిలిచింది. ఈ గ్లింప్స్ చూస్తుంటే ప్రశాంత్ నీల్ ఈసారి ఇండియాను కదిలించే ఒక భారీ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది.
భారతదేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న కాలం నుంచి మొదలై.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దేశాన్ని పట్టి పీడిస్తున్న నేటి మాదక ద్రవ్యాల నెట్‌వర్క్ నేపథ్యంలో ఈ కథ నడుస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చారు. బ్రిటిష్ కాలం నాటి క్రూరత్వం, నాటి అండర్‌వరల్డ్ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ఢీకొట్టే ఒక పవర్‌ఫుల్, అగ్రెసివ్ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. గ్లింప్స్‌లో వినిపించిన పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎన్టీఆర్ కళ్లలో చూపించిన ఇంటెన్సిటీ థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ రచ్చ లేపడం ఖాయంగా కనిపిస్తోంది.
'సప్త సాగరాలు దాటి' ఫేమ్, కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కథలో చాలా కీలకమని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో మ్యూజిక్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ గ్లింప్స్‌లో వచ్చే అదిరిపోయే బీజీఎమ్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. సినిమాటోగ్రఫీ, యాక్షన్ కంపోజిషన్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. బాక్సాఫీస్‌పై 'డ్రాగన్' దండయాత్రకు ముహూర్తం కూడా ఖరారైంది.
ఈ భారీ పాన్-ఇండియా చిత్రం 2027, జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా థియేటర్లలో విడుదల కానుంది. మొత్తానికి 'సలార్', 'కేజీఎఫ్' చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్.. మన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌ను ఏ రేంజ్‌లో చూపించబోతున్నాడో ఈ చిన్న గ్లింప్స్‌తోనే శాంపిల్ చూపించేశాడు. ఈ గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ ఇక బాక్సాఫీస్ రికార్డుల వేట మొదలైనట్టే అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.