Chiranjeevi: చిరంజీవితో సినిమా తీయాలంటే రాజమౌళి కూడా భయపడాల్సిందే.. డైరెక్టర్ కామెంట్స్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించడం అంటే ఎంతటి బాధ్యతో, ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో దర్శకుడు వి.వి.వినాయక్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు.

Update: 2026-06-05 11:59 GMT

Chiranjeevi: చిరంజీవితో సినిమా తీయాలంటే రాజమౌళి కూడా భయపడాల్సిందే.. డైరెక్టర్ కామెంట్స్

Chiranjeevi: తెలుగు చిత్ర పరిశ్రమలో 'మాస్' చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు వి.వి. వినాయక్. ఆయన తెరకెక్కించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఆయన చేసిన 'ఠాగూర్', 'ఖైదీ నెం. 150' చిత్రాలు ఎంతటి భారీ హిట్లు సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, హిట్లు ఎన్ని ఉన్నా, చిరంజీవితో సినిమా చేయడం అంటే మాటలు కాదని, ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో వినాయక్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడుతూ.. "నేను కంటిన్యూగా వరుస హిట్లు ఇచ్చినా సరే, చిరంజీవి సినిమా అనగానే నా తలపై ఎంతో ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఆయన సినిమాపై ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. నాకే కాదు, బ్లాక్ బస్టర్ హిట్లు ఇస్తున్న దర్శకధీరుడు రాజమౌళి కూడా చిరంజీవితో సినిమా చేయాలంటే కచ్చితంగా టెన్షన్ పడాల్సిందే!" అని వినాయక్ కుండబద్దలు కొట్టారు. ఆ సినిమా బాధ్యత అంత పెద్దది అని ఆయన వివరించారు.

తన తండ్రి బ్రతికున్నంత కాలం తన సినిమాల్లో తప్పులు ఎత్తిచూపుతూ తనను ఎంతో గైడ్ చేశారని వినాయక్ గుర్తుచేసుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత తనను ప్రశ్నించే వారు లేకుండా పోయారని, ఆ వెలితిని చిరంజీవి భర్తీ చేశారని ఆయన చెప్పారు. "చిరంజీవి స్క్రిప్ట్ విషయంలో ఎంతో పర్ఫెక్ట్‌గా ఉంటారు. మనం 100 ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేసుకుంటే, ఆయన 101వ ప్రశ్న అడుగుతారు.

ఒక లాజిక్ అడిగారంటే దానికి దర్శకుడిగా మనం సరైన సమాధానం చెప్పాలి. సినిమా కోసం ఆయన ఏం చేసినా అది సినిమాను మరింత గొప్పగా తీర్చిదిద్దడానికే. ఆయన సినిమాకి పెడుతున్న కోట్ల రూపాయల బడ్జెట్ కంటే, ఆయన కోసం ఎదురుచూస్తున్న కోట్ల మంది ఫ్యాన్స్‌ను ఆనందపరచడమే ఆయనకు పెద్ద టెన్షన్. ఇప్పటికీ ఆయన తన మొదటి సినిమా లాగే అంతే అంకితభావంతో పనిచేస్తారు," అని వినాయక్ ప్రశంసించారు.

Tags:    

Similar News