Peddi Movie: "పెద్ది" మూవీకి మిక్స్‌డ్ టాక్‌.. బుచ్చిబాబు వెన్నుపోటు అంటూ

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ మూవీకి మిక్స్‌డ్ టాక్.

Update: 2026-06-05 02:05 GMT

Peddi Movie: "పెద్ది" మూవీకి మిక్స్‌డ్ టాక్‌.. బుచ్చిబాబు వెన్నుపోటు అంటూ

Ram Charan: 'గేమ్ ఛేంజర్' ఇచ్చిన చేదు జ్ఞాపకాలను మరిపిస్తూ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉంటాడనే భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది 'పెద్ది'. 'ఉప్పెన' లాంటి క్లాసిక్ హిట్‌తో మెప్పించిన బుచ్చిబాబు సన దర్శకత్వం, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం, దానికి తోడు జాన్వీ కపూర్ గ్లామర్.. ఇలా అన్నీ కలిపి ఈ సినిమాపై హైప్‌ను స్కై లెవెల్‌కు తీసుకెళ్లాయి. గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పూర్తి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

సినిమా చూసొచ్చిన ప్రేక్షకులలో, ముఖ్యంగా మెగా అభిమానులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సినిమా బాగుందని అంటుంటే, మెజారిటీ ప్రేక్షకులు మాత్రం ఇంకా బాగా తీసి ఉండాల్సింది అంటూ పెదవి విరుస్తున్నారు. కథలోకి వెళ్లేందుకు దర్శకుడు ఎక్కువ సమయం తీసుకోవడం, లీడ్ సీన్లు సాగతీసినట్లు అనిపించడంతో మొదటి భాగం కొంతవరకు బోరింగ్‌గా సాగిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ద్వితీయార్థంలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్, డ్రామా ప్రేక్షకుడి ఓపికకు పరీక్ష పెట్టేలా ఉన్నాయని, ల్యాగ్ ఎక్కువగా ఉందనేది సగటు సినిమా ప్రేమికుడి వాదన.

ప్లస్ పాయింట్స్ ఏంటి?

మిక్స్‌డ్ టాక్ ఉన్నప్పటికీ, సినిమాలో కొన్ని అంశాలు మాత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చరణ్ తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాను ఒంటిచేత్తో నడిపించే ప్రయత్నం చేశారు. ఆయన లుక్, యాక్టింగ్ అదిరిపోయాయని అభిమానులు చెబుతున్నారు.జగపతిబాబు మార్క్ నటన, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు పెద్ద అసెట్‌గా మారాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఏఆర్ రెహమాన్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

బాక్సాఫీస్ దగ్గర నిలబడేనా?

'గేమ్ ఛేంజర్' లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒక సాలిడ్ కంబ్యాక్ ఆశించారు. అయితే 'పెద్ది' చిత్రానికి వచ్చిన ఈ మిక్స్‌డ్ టాక్ కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. వీకెండ్ కలెక్షన్లు ఈ సినిమా భవితవ్యాన్ని తేల్చనున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ ఎమోషనల్ డ్రామా కనెక్ట్ అయితే మాత్రం సినిమా బాక్సాఫీస్ వద్ద పుంజుకునే అవకాశం ఉంది. మరి రామ్ చరణ్ 'పెద్ది'తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి.


Tags:    

Similar News