Vijay And Trisha: విజయ్-త్రిష పెళ్లిలో డ్యాన్స్ చేస్తా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Vijay And Trisha: తమిళనాడు పీఠంపై విజయ్ శకం మొదలు. మే 10న సీఎం బాధ్యతలు చేపట్టబోతున్న వేళ, విజయ్-త్రిష పెళ్లి గురించి రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Update: 2026-05-10 05:38 GMT

Vijay And Trisha: విజయ్-త్రిష పెళ్లిలో డ్యాన్స్ చేస్తా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Rakhi Sawant: తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం ఒక హై-వోల్టేజ్ సినిమాను తలపిస్తున్నాయి. వెండితెరపై దళపతిగా వెలిగిపోయిన విజయ్, ఇప్పుడు రాజకీయ తెరపై ముఖ్యమంత్రిగా సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. 107 స్థానాలతో టీవీకే పార్టీని అతిపెద్ద శక్తిగా నిలిపిన విజయ్, రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.

నేడే ముహూర్తం

గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. మ్యాజిక్ ఫిగర్‌కు స్వల్ప దూరంలో ఉన్నా, వ్యూహాత్మకంగా అడుగులు వేసి విజయ్ అడ్డంకులన్నీ తొలగించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం, మే 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దశాబ్దాల ద్రావిడ రాజకీయాల్లో ఒక నటుడు ఈ స్థాయిలో ప్రభావితం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అగ్నికి ఆజ్యం పోసిన రాఖీ సావంత్

విజయ్ రాజకీయ విజయంతో పాటు, ఆయన వ్యక్తిగత జీవితంపై కూడా సోషల్ మీడియాలో కథనాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ త్రిషతో ఆయన వివాహం జరగబోతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ డ్రామా క్వీన్ రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. రాఖీ మాట్లాడుతూ.. విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే, నేను వారి మెహందీ వేడుకలో డ్యాన్స్ చేస్తాను. వారితో కలిసి ఫోటోలు దిగుతాను అంటూ తనదైన శైలిలో కామెంట్స్ చేసింది. అంతేకాకుండా విజయ్‌తో స్టెప్పులు వేయడం తన కల అని, అది నెరవేరలేదని చెప్పుకొచ్చింది.

నెటిజన్ల ఆగ్రహం

ఒక రాష్ట్రానికి బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న వ్యక్తిపై, ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేయడంపై నెటిజన్లు రాఖీ సావంత్‌ను ఏకిపారేస్తున్నారు. సీరియస్ పాలిటిక్స్‌ను కూడా జోక్ చేస్తున్నావా? అని కొందరు ప్రశ్నిస్తుంటే.. పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారుతావా? అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. ఒకవైపు తమిళనాడులో విజయ్ శకం మొదలవుతున్న వేళ, ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

Tags:    

Similar News