భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ‘కొరియన్ కనకరాజు’!
Korean Kanakaraju: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్-కామెడీ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది.
భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ‘కొరియన్ కనకరాజు’!
Korean Kanakaraju: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్-కామెడీ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 7న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే సినిమా విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో ఈ చిత్రం భారీ బిజినెస్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా భారీ రికవరీ
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ, శాటిలైట్, ఆడియో , హిందీ డబ్బింగ్ హక్కులు కలిపి దాదాపు రూ. 26 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాయి. సుమారు రూ. 38 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, కేవలం నాన్-థియేట్రికల్ డీల్స్ ద్వారానే తన పెట్టుబడిలో సింహభాగాన్ని రాబట్టుకోవడం విశేషం. ఇక థియేట్రికల్ హక్కుల ద్వారా మరో రూ. 12-15 కోట్లు రాబట్టవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో సినిమా విడుదల ముందే లాభాల బాట పట్టేలా కనిపిస్తోంది.
కారణాలు … తారాగణం
ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్స్ , ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతోనే ఈ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్, రితికా నాయక్‌లతో పాటు కమెడియన్ సత్య కీలక పాత్రలో అలరించనున్నారు. యువి క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.