Kajal Aggarwal: కాజల్‌కి క్యారవాన్‌లో చేదు అనుభవం.. షర్ట్ విప్పేసి ఆ పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్..!

Kajal Aggarwal: షూటింగ్ క్యారవాన్‌లో ఒక అసిస్టెంట్ డైరెక్టరే తన షర్ట్ విప్పేసి ఛాతీపై టాటూ చూపించాడని నటి కాజల్ అగర్వాల్ సంచలన విషయాలు బయటపెట్టారు.

Update: 2026-07-24 05:56 GMT

Kajal Aggarwal: కాజల్‌కి క్యారవాన్‌లో చేదు అనుభవం.. షర్ట్ విప్పేసి ఆ పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్..!

Kajal Aggarwal: టాలీవుడ్ ‘చందమామ’ కాజల్ అగర్వాల్ పెళ్లయి, బాబు పుట్టిన తర్వాత కూడా చెక్కుచెదరని అందంతో, వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సత్తా చాటుతున్న కాజల్ నటిస్తున్న కొత్త చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ డ్రామాలో కాజల్ ఒక పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో అలరించనుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న కాజల్, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు సెట్స్‌లో ఎదురైన ఒక షాకింగ్ అండ్ చేదు అనుభవాన్ని బయటపెట్టి వార్తల్లో నిలిచింది.

షూటింగ్ సెట్స్‌లో ఫ్యాన్స్ లేదా క్రూ మెంబర్స్ అభిమానం చూపించడం సాధారణమే. కానీ, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ప్రవర్తించిన తీరు కాజల్‌ను తీవ్ర భయాందోళనకు గురిచేసిందట. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ కాజల్ ఇలా చెప్పింది. కొద్ది రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్ ఫస్ట్ డే పూర్తయ్యాక నేను నా క్యారవాన్‌లో ఒంటరిగా ఉన్నాను.

ఆ సమయంలో ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి నా అనుమతి లేకుండా ఉన్నపళంగా క్యారవాన్‌లోకి దూసుకొచ్చాడు. నా ముందుకు రాగానే ఏకంగా తన షర్ట్ విప్పేశాడు. ఏంటా అని షాక్ అయ్యేలోపే, తన ఛాతీపై నా పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్నట్లు చూపించాడు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న క్యారవాన్‌లో అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో తాను క్షణం పాటు వణికిపోయానని కాజల్ తెలిపింది.

ఒక నటిగా నాపై అతనికి ఉన్న అభిమానాన్ని నేను గౌరవిస్తాను, సంతోషిస్తాను. కానీ నేను ఒంటరిగా ఉన్న ప్రైవేట్ స్పేస్‌లోకి పర్మిషన్ లేకుండా వచ్చి ఇలా ప్రవర్తించడం ఎంతమాత్రం సరికాదు. అందుకే ఆ తర్వాత అతనికి సున్నితంగానే క్లాస్ పీకి, హెచ్చరించాను అని కాజల్ పేర్కొంది. ప్రస్తుతం కాజల్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చేదు అనుభవాలు ఎదురైనా తన వృత్తి పట్ల పూర్తి అంకితభావంతో ముందుకు సాగుతోంది కాజల్.

ఆహార కల్తీ, రసాయనాల వాడకం, ప్రజల ఆరోగ్యం వంటి సామాజికాంశాల ఆధారంగా తెరకెక్కిన ది ఇండియా స్టోరీలో పవర్‌ఫుల్ లాయర్‌గా నటించింది. శ్రేయస్ తల్పడే, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘భగవంత కేసరి’ సక్సెస్ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో రెండోసారి బాలయ్య సరసన కథానాయికగా అలరించబోతోంది.

అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ రామాయణ్‌లో 'మండోదరి' పాత్రలో కాజల్ కనిపించనుంది.కమల్ హాసన్ - శంకర్ కాంబోలో వస్తున్న ఇండియన్ 3 సీక్వెల్‌లోనూ కాజల్ కీలక పాత్ర పోషిస్తోంది. ఏదేమైనా, ఎంతటి అభిమానమైనా హద్దుల్లో ఉన్నప్పుడే దానికి గౌరవం ఉంటుందని కాజల్ స్పష్టం చేసిన తీరును నెటిజన్లు, సినీ ప్రియులు సమర్థిస్తున్నారు.

Tags:    

Similar News