క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ'కి ఫిదా అయిన టామ్ క్రూజ్!

The Odyssey: క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం 'ది ఒడిస్సీ' ఇప్పుడు హాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Update: 2026-07-17 09:49 GMT

క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ'కి ఫిదా అయిన టామ్ క్రూజ్!

The Odyssey: క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం 'ది ఒడిస్సీ' ఇప్పుడు హాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రసిద్ధ కవి హోమర్ రాసిన కావ్యం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ అయితే ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. థియేటర్‌లో సినిమా చూశాక ఆయన ఎంతగా థ్రిల్ అయ్యారంటే, తన సోషల్ మీడియాలో పోస్టర్ ముందు నిలబడిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. "ఏం సినిమా! క్రిస్, ఎమ్మా , మీ అద్భుతమైన టీమ్‌కు థాంక్స్. థియేటర్‌లో ఈ రాత్రి చాలా మెమరబుల్" అని తన ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సినిమాలో ఇథాకా రాజు 'ఒడిస్సియస్'గా మ్యాట్ డామన్ నటించారు. ట్రోజన్ యుద్ధం తర్వాత అతను తన ఇంటికి చేరుకోవడానికి పడే కష్టాలే ఈ సినిమా కథ. అయితే, ఈ పాయింట్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్‌లో మ్యాట్ డామన్‌ను ఇంటికి పంపడానికే కోట్లు ఖర్చు పెడతారా అని జనాలు జోకులు వేసుకుంటున్నారు.

ఎందుకంటే ఆయన గత సినిమాలు 'సేవింగ్ ప్రైవేట్ ర్యాన్', 'ది మార్షియన్', చివరకు నోలన్ సినిమా 'ఇంటర్‌స్టెల్లార్'లో కూడా ఆయన పాత్ర ఏదో ఒక మిషన్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి రావడమో లేదా ఎక్కడో చిక్కుకుపోయి రక్షణ కోసం చూడటమే ఉంటుంది. అందుకే ఈసారి కూడా మ్యాట్ డామన్‌ని ఇంటికి చేర్చడమే నోలన్ లక్ష్యమని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

ఇక టెక్నికల్ విషయానికి వస్తే, ఈ సినిమాకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. పూర్తి స్థాయిలో ఐమ్యాక్స్ (IMAX) కెమెరాలతో షూట్ చేసిన మొదటి మేజర్ స్టూడియో ప్రొడక్షన్ ఇదే. కేవలం మ్యాట్ డామనే కాకుండా టామ్ హాలండ్, అన్నే హాత్వే, రాబర్ట్ పాటిన్సన్, జెండయా వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు. క్రిస్టోఫర్ నోలన్ కెరీర్‌లోనే 'ది ఒడిస్సీ' ఒక బెస్ట్ సినిమా అని రివ్యూలు వస్తుండటంతో, సినిమా చూసేందుకు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు.

Tags:    

Similar News