Irumudi: సొంత థియేటర్‌లోనే రవితేజ ‘ఇరుముడి’కి బిగ్ షాక్!

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినా సొంత థియేటర్ ఏఆర్‌టీలో ‘టాక్సిక్’ రచ్చ నడుస్తోంది.

Update: 2026-08-26 06:28 GMT

 Irumudi: సొంత థియేటర్‌లోనే రవితేజ ‘ఇరుముడి’కి బిగ్ షాక్!

 Irumudi: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుని విజయపథంలో దూసుకెళ్తోంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుండటంతో, వర్కింగ్ డేస్‌లోనూ పలు చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కలెక్షన్ల పరంగా రవితేజ కెరీర్‌లోనే ఇది మరో బెస్ట్ మూవీగా నిలిచే దిశగా సాగుతున్న సమయాన, థియేటర్ల పెంపు/తగ్గింపు వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

కన్నడ స్టార్ యష్ నటించిన పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ విడుదలవుతుండటంతో, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ స్థాయిలో స్క్రీన్లు కేటాయించారు. అయితే అందరినీ ఆశ్చర్యపరిచిన విషయమేమిటంటే... హైదరాబాద్‌లోని రవితేజ సొంత థియేటర్ ‘ఏఆర్‌టీ’ కాంప్లెక్స్‌లోనే ‘ఇరుముడి’కి కోత పడటం.

మొత్తం 15షోలకు గానూ ‘టాక్సిక్’ మూవీకి 10 షోలు‘ఇరుముడి’ మూవీకి 5 షోలు కేటాయించారు. హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న తన స్వంత చిత్రం 'ఇరుముడి' కంటే, కొత్తగా విడుదలవుతున్న 'టాక్సిక్' చిత్రానికే తన థియేటర్‌లో ఎక్కువ ప్రాధాన్యత లభించడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

అయితే, బిజినెస్ కోణంలో పరిశీలిస్తే... ఒక పెద్ద పాన్-ఇండియా చిత్రం విడుదలయ్యే రోజు కావడం వల్ల ఓపెనింగ్ డే డిమాండ్‌ను బట్టి ఎక్కువ షోలు కేటాయించడం సాధారణమే. ఈ రోజు ‘టాక్సిక్’ టాక్, ఆక్యుపెన్సీ ఆధారంగా రేపటి నుంచి ‘ఏఆర్‌టీ’ స్క్రీన్‌లలో ‘ఇరుముడి’ షోలు పెంచుతారా లేదా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News