Rashmika Mandanna: 'దేశంలోనే నంబర్ వన్ హీరోయిన్ రష్మిక మందన్నా'.. దేవరకొండ ఇన్‌స్టా పోస్ట్ వైరల్.!
Rashmika Mandanna: ఇండియా టుడే మ్యాగజైన్ రష్మిక మందన్నాను దేశంలోనే నంబర్ వన్ హీరోయిన్‌గా ప్రకటించింది. దీనిపై విజయ్ పోస్ట్ చేయగా.. అది కాస్తా ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.
Rashmika Mandanna: 'దేశంలోనే నంబర్ వన్ హీరోయిన్ రష్మిక మందన్నా'.. దేవరకొండ ఇన్‌స్టా పోస్ట్ వైరల్.!
Rashmika Mandanna: ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో రష్మిక మందన్నా హవా నడుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస భారీ పాన్ ఇండియా ఆఫర్లతో ఆమె దూసుకుపోతోంది. తాజాగా ప్రముఖ జాతీయ మ్యాగజైన్ ఇండియా టుడే దేశంలోనే నంబర్ వన్ హీరోయిన్ రష్మిక మందన్నా అని అధికారికంగా పేర్కొంది. ఈ మేరకు మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె ఫోటోను ప్రచురిస్తూ 'ది న్యూ నేషనల్ స్టార్' అని ప్రశంసిస్తూ ప్రత్యేక కథనాన్ని రాసుకొచ్చింది. ఎలాంటి సినీ నేపథ్యం లేని సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయిలో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకోవడం పట్ల అభిమానులు అమితమైన సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియా టుడే విడుదల చేసిన ఈ సరికొత్త జాబితాలో రష్మిక మందన్నా అగ్రస్థానంలో నిలవగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, ఆలియా భట్ వరుస స్థానాల్లో ఉన్నారని మ్యాగజైన్ స్పష్టం చేసింది. దశాబ్ద కాలంగా బాలీవుడ్‌ను ఏలుతున్న అగ్ర కథానాయికలను సైతం వెనక్కి నెట్టి రష్మిక మొదటి స్థానానికి చేరుకోవడం సినిమా రంగంలో ఒక సంచలనంగా మారింది. కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించి, తెలుగులో నేషనల్ క్రష్ గా మారి, ఇప్పుడు హిందీ ప్రేక్షకులను సైతం తన అద్భుత నటనతో మెప్పించి దేశవ్యాప్తంగా నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
రష్మిక ఈ అరుదైన స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం ఆమె ఎంచుకున్న వైవిధ్యమైన చిత్రాలే. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో నటించిన 'పుష్ప' సినిమా ఆమె కెరీర్‌ను పూర్తిగా మలుపు తిప్పింది. శ్రీవల్లి పాత్రలో ఆమె నటనకు, డ్యాన్సులకు దేశవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు దక్కింది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ తో చేసిన 'యానిమల్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 900 కోట్లు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో గీతాంజలి పాత్రలో ఆమె భావోద్వేగ భరిత నటనకు విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు దక్కాయి. 'పుష్ప 2', హిందీలో 'ఛావా', ధనుష్ తో 'కుబేర' లాంటి చిత్రాలతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. సినిమాలతో పాటే బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా ఏటా రూ. కోట్లు గడిస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన పోస్టును ఆమె భర్త, టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ 'పీక్ స్టఫ్, గర్వంగా ఉంది' అంటూ పోస్ట్ చేశాడు. కాగా, ఈ పోస్ట్ క్షణాల్లో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.