Box Office: ఈ రికార్డు కొట్టడం ఎవరి వల్ల కాదేమో..!

Box Office: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన 'ఇరుముడి' చిత్రం 12 రోజుల్లో రూ. 200 కోట్ల గ్రాస్ సాధించి జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

Update: 2026-09-03 04:38 GMT

Box Office: ఈ రికార్డు కొట్టడం ఎవరి వల్ల కాదేమో..!

Irumudi: మాస్ మహారాజా రవితేజ, క్లాస్ ఎమోషన్స్‌ను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన భావోద్వేగ భక్తిరస చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. రవితేజ మార్క్ ఎనర్జీకి తోడు, కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసే శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్ కుదరడంతో ఈ సినిమా థియేటర్లలో రికార్డులు తిరగరాస్తోంది.

ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చిన కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటి సంచలనం సృష్టించింది. అదే జోరును కొనసాగిస్తూ కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది.

రవితేజ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమా ఘనతపై మైత్రీ మూవీ మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, అన్ని వర్గాల ప్రజలు ఈ చిత్రాన్ని థియేటర్లలో ఒక ఉత్సవంలా ఆదరిస్తున్నారని, ఇది నిజమైన జనరేషనల్ బ్లాక్‌బస్టర్ అని మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు.

ఆంధ్రా, సీడెడ్, ఓవర్సీస్ ఏరియాల్లో అద్భుతమైన కలెక్షన్లు రాబడుతున్న ఈ సినిమా, నైజాం మార్కెట్‌లో మాత్రం అంచనాలకు అందని రీతిలో విద్వంసం సృష్టిస్తోంది. 12వ రోజు కూడా నైజాంలో రూ.2.51 కోట్ల గ్రాస్, రూ.1.19 కోట్ల నెట్ సాధించింది. ఇప్పటివరకు నైజాం ఏరియాలోనే రూ.80.65 కోట్ల గ్రాస్, రూ.43.3 కోట్ల షేర్ సాధించి రవితేజ కెరీర్‌లోనే ఆల్-టైమ్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా చరిత్ర సృష్టించింది.

సినిమాలో ప్రియా భవానీ శంకర్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, రవితేజ - బాలనటి బేబీ నక్షత్రల మధ్య వచ్చిన తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రేక్షకుల గుండెలను హత్తుకుంటోంది. వీటికి తోడు 'మల్లెపూల పల్లకి' పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచి మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. భక్తి, కుటుంబ బంధాలు, ఎమోషన్స్ సమపాళ్లలో కుదరడంతో రానున్న రోజుల్లో ఈ చిత్రం రూ.250 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


 


Tags:    

Similar News