పీఎం మోదీతో రామ్ చరణ్ ముచ్చట్లు.. ‘పెద్ది’ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదేనా!
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’.
పీఎం మోదీతో రామ్ చరణ్ ముచ్చట్లు.. ‘పెద్ది’ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదేనా!
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన నేషనల్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న రామ్ చరణ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణను పంచుకుంటూ, ‘పెద్ది’ సినిమాకు దానికి ఉన్న కనెక్షన్‌ను రివీల్ చేశారు.
‘వికసిత్ భారత్’ కాన్సెప్ట్‌తో ‘పెద్ది’.. మోదీతో చరణ్ ముచ్చట్లు
ఢిల్లీ ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. “నేను ఢిల్లీలో మోదీ గారిని కలిసినప్పుడు, ఆయన నన్ను ‘పెద్ది’ సినిమా కథేంటి అని అడిగారు. ఈ సినిమా ‘వికసిత్ భారత్’ అంటే గ్రామాల్లో సాధికారత, గ్రామీణ అభివృద్ధి నేపథ్యంలో సాగుతుందని చెప్పాను. ఆ సమయంలో మోదీ గారు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో తనకు ఎదురైన ఒక అద్భుతమైన అనుభవాన్ని నాతో పంచుకున్నారు” అని చరణ్ తెలిపారు.
ఒక్క వ్యక్తి తెచ్చిన మార్పు.. బెంగాల్ విలేజ్ ఇన్‌స్పిరేషన్
మోదీ చెప్పిన ఆసక్తికర విశేషాన్ని చరణ్ వివరిస్తూ.. “బెంగాల్‌లోని ఒక చిన్న గ్రామంలో ప్రచారానికి వెళ్లినప్పుడు చాలా మంది ఫుట్‌బాల్ జెర్సీలు వేసుకుని కనిపించారట. దాని గురించి మోదీ గారు ఆరా తీస్తే.. ఆ ప్రాంతానికి చెందిన ‘మహమ్మద్’ అనే వ్యక్తి గతంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడని, అతడిని స్ఫూర్తిగా తీసుకుని ఆ ఊరి వాళ్లంతా ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టారని తెలిసింది. ఈ రోజు ఆ ఒక్క చిన్న పల్లెటూరు నుండి ఏకంగా 85 మందికి పైగా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్స్ రావడం గమనార్హం. సమాజంలో ఒక్క వ్యక్తి అయినా సరే ఎంతటి విప్లవాత్మక మార్పు తీసుకురాగలడో చెప్పడానికి ఇదే నిదర్శనం. మా ‘పెద్ది’ సినిమా కూడా ఒక గిరిజన ప్రాంతం నుండి వచ్చి, తన జాతి తలరాతను మార్చిన ఒకే ఒక్కడి కథ” అని రామ్ చరణ్ స్పష్టం చేశారు.
ఆస్కార్ రేంజ్ కాస్టింగ్ అండ్ క్రూ:
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ విజువల్ వండర్‌లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్‌స్పిరేషన్ అండ్ వికసిత్ భారత్ బ్యాక్‌డ్రాప్ కనెక్షన్ తో వస్తున్న ఈ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా, జూన్ 4న అన్ని ప్రధాన భారతీయ భాషల్లో థియేటర్లను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది!