Peddi Movie: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగిపోయిన ‘పెద్ది’ రిలీజ్..!

Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ జపాన్ విడుదల వాయిదా పడింది.

Update: 2026-05-28 02:29 GMT

Peddi Movie: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగిపోయిన ‘పెద్ది’ రిలీజ్..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ అభిమానులకు సరిగ్గా సినిమా రిలీజ్ ముంగిట ఒక షాకింగ్ వార్త ఎదరైంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ జపాన్ విడుదలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇండియాతో పాటే జూన్ 4న జపాన్‌లోనూ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, కొన్ని అనివార్య సాంకేతిక కారణాల వల్ల అక్కడ రిలీజ్ వాయిదా పడినట్లు డిస్ట్రిబ్యూటర్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సడన్ డెసిషన్‌తో జపాన్‌లోని మెగా ఫ్యాన్స్, అక్కడ స్థిరపడిన ప్రవాస భారతీయులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం జపాన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో రామ్‌చరణ్ నటనకు, స్టైల్‌కు జపాన్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అక్కడ చరణ్‌కు హాలీవుడ్ రేంజ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ గ్లోబల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ‘పెద్ది’ చిత్రాన్ని ఒకే రోజు జపాన్‌లోనూ దించాలని చూశారు. ఒకవేళ ప్లాన్ ప్రకారం జూన్ 4నే అక్కడ కూడా బొమ్మ పడి ఉంటే.. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా సరికొత్త రికార్డులు నమోదయ్యేవని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే అంతర్గత ఇబ్బందుల వల్ల ఈ ప్లాన్ వాయిదా పడటం ట్రేడ్ వర్గాలను కూడా కాస్త నిరాశపరిచింది.

జపాన్ మెగా ఫ్యాన్స్ అస్సలు తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా క్యాన్సిల్ అవ్వలేదు, కేవలం పోస్ట్‌పోన్ మాత్రమే అయింది. అక్కడ ఉన్న టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ అవ్వగానే, త్వరలోనే ఒక క్రేజీ డేట్‌ను అనౌన్స్ చేసి మరికొన్ని రోజుల్లోనే ‘పెద్ది’ని జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. జపాన్ రిలీజ్ వాయిదా పడినప్పటికీ.. ఇండియాలో ,మిగతా ఓవర్సీస్ మార్కెట్లలో మాత్రం ‘పెద్ది’ ప్రమోషన్స్, అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్‌లో దూసుకుపోతున్నాయి.

బుచ్చిబాబు సానా మార్క్ ఎమోషన్స్, విలేజ్ బ్యాక్‌డ్రాప్, స్పోర్ట్స్ యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లాయి. ఒకవైపు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, మరోవైపు రామ్‌చరణ్ రగ్గడ్ లుక్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. జపాన్ ఫ్యాన్స్ కాస్త వెయిట్ చేయాల్సి వచ్చినా.. జూన్ 4న బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.

Tags:    

Similar News