Nithya Menen: జాన్వీ కపూర్ బోల్డ్ సీన్స్‌పై నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

Nithya Menen: ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ గ్లామర్ వివాదంపై నటి నిత్యా మీనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-06-10 06:50 GMT

Nithya Menen: జాన్వీ కపూర్ బోల్డ్ సీన్స్‌పై నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

Janhvi Kapoor: చిత్ర పరిశ్రమలో గ్లామర్ అనేది ఒక భాగమే అయినప్పటికీ.. కొన్నిసార్లు అది కాస్తా అతిగా మారి వివాదాలకు దారితీస్తుంది. తాజాగా వచ్చిన పెద్ది’ సినిమా చుట్టూ ఇప్పుడు ఇలాంటి ఒక పెద్ద వివాదమే నడుస్తోంది. ఈ సినిమాలో కథానాయిక జాన్వీ కపూర్ పాత్రను విపరీతంగా గ్లామరైజ్ చేస్తూ.. కేవలం ఒక వస్తువులా చూపించారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ హాట్ టాపిక్ , సినీ ఇండస్ట్రీలో మహిళల ప్రదర్శనపై నేచురల్ యాక్ట్రెస్ నిత్యా మీనన్ ఒక ఇంటర్వ్యూలో చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇంటర్వ్యూలో ‘పెద్ది’ వివాదం గురించి నిత్యా మీనన్‌ను ప్రశ్నించగా.. ఆమె చాలా పరిణతితో, బోల్డ్‌గా సమాధానమిచ్చారు. తాను ఇంకా ఆ సినిమా చూడలేదని చెప్తూనే.. తెరపై మహిళలను కేవలం ఒక వస్తువుగా చూపించడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. సినిమాల్లో మహిళలను గ్లామర్ వస్తువుగా చూపించే ధోరణి కేవలం సౌత్ సినిమాకే పరిమితం కాలేదు. ఇది హాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రపంచవ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఉన్న పెద్ద సమస్య అని నిత్యా మీనన్ తెలిపారు. దీనంతటికీ ప్రధాన కారణం సినిమాల్లో పెరిగిపోయిన హైపర్-కమర్షియలైజేషన్ అని ఆమె అభిప్రాయపడ్డారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టడానికి, ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడానికి ఇలాంటి సీన్లు పెడుతుంటారని, కానీ కొన్నిసార్లు ఇది కచ్చితంగా హద్దులు దాటడమేనని నిత్యా మీనన్ తేల్చి చెప్పారు.

నటీనటులు ఇండస్ట్రీలో తమకంటూ కొన్ని స్పష్టమైన హద్దులను ఏర్పాటు చేసుకోవాలని నిత్యా మీనన్ సూచించారు. మనకు ఇష్టం లేని సీన్లు ఉన్నప్పుడు లేదా మనల్ని కేవలం ఒక గ్లామర్ బొమ్మలా వాడుకుంటున్నారని అనిపించినప్పుడు, గట్టిగా నిలబడి నాకిది ఇష్టం లేదు అని చెప్పగలగాలి. నాకు పేరు ప్రతిష్టల కంటే నా విలువలకే ప్రాధాన్యత ఎక్కువ, అందుకే నేను కొన్ని రకాల పాత్రలకు దూరంగా ఉంటాను అని నిత్యా మీనన్ పేర్కొన్నారు. చాలా ఏళ్ల పాటు కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలన్నీ చేసేసి, హఠాత్తుగా ఒక రోజు వచ్చి అభ్యంతరం చెప్తే పరిశ్రమలో ఎవరూ సీరియస్‌గా తీసుకోరని.. అందుకే కెరీర్ మొదటి నుంచే నటీనటులు తమ హద్దుల విషయంలో చాలా స్పష్టంగా ఉండాలని ఆమె ఒక విలువైన సలహా ఇచ్చారు.

ఇక ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను పరిచయం చేసే సీన్లలో ఆమె ముఖం చూపించకుండా.. కేవలం శారీరక సౌందర్యంపైనే కెమెరా యాంగిల్స్ ఫోకస్ పెట్టడంపై విమర్శకులు సైతం మండిపడ్డారు. ఈ విమర్శల తీవ్రతను గమనించిన దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే అధికారికంగా స్పందించారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తమకు లేదని చెప్తూ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. అంతేకాదు, ఆడియన్స్ ఫీడ్‌బ్యాక్ గౌరవిస్తూ ఆ వివాదాస్పద సీన్లను సినిమా నుండి ఎడిట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News