అమీర్ ఖాన్ ‘లాహోర్ 1947’ ఇక ‘బట్వారా 1947’.. మోషన్ పోస్టర్ అవుట్!
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నిర్మాణంలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ఒక భారీ మార్పును సంతరించుకుంది.
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నిర్మాణంలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ఒక భారీ మార్పును సంతరించుకుంది. ఇప్పటివరకు ‘లాహోర్ 1947’ (Lahore 1947) అనే వర్కింగ్ టైటిల్‌తో శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పేరును అధికారికంగా ‘బట్వారా 1947’ (Batwara 1947) గా మారుస్తూ మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఈ సినిమా కొత్త టైటిల్‌తో కూడిన ఫస్ట్ మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. భారతదేశ విభజన నాటి భీభత్సం, దేశభక్తి నేపథ్యంతో వస్తున్న ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
30 ఏళ్ల తర్వాత ఆ లెజెండరీ కాంబో పునరాగమనం
ఈ చిత్రానికి ప్రముఖ సీనియర్ దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి కథ, దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ సినీ చరిత్రలో సన్నీ డియోల్ , రాజ్‌కుమార్ సంతోషి కాంబినేషన్‌కు ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఉంది. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘ఘాయల్’ (1990), ‘దామిని’ (1993), , ‘ఘాతక్’ (1996) వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ క్రేజీ కాంబో మళ్లీ ఈ సినిమా కోసం చేతులు కలపడం విశేషం. ద్వేషం, భయాందోళనలు రాజ్యమేలుతున్న ఆ కల్లోల కాలంలో కేవలం ధైర్యాన్నే ఆయుధంగా ఎంచుకున్న ఒక వీరుడి పోరాటమే ఈ సినిమా కథాంశమని మేకర్స్ ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు.
ఆగస్టు 14న థియేటర్లలో దేశభక్తి జాతర
అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమీర్ ఖాన్ , అపర్ణ పురోహిత్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మోషన్ పోస్టర్‌లో కనిపిస్తున్న సన్నీ డియోల్ వింటేజ్ లుక్, మంటల మధ్య జనం పరుగులు పెడుతున్న విజువల్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ సాహిత్యం సమకూరుస్తున్నారు.
ఈ సినిమాలో సన్నీ డియోల్ సరసన సీనియర్ నటి శబానా అజ్మీ, చాలా కాలం తర్వాత వెండితెరపైకి వస్తున్న ప్రీతి జింతా, అలీ ఫజల్, కరణ్ డియోల్, అభిమన్యు సింగ్, ఖుషీ హజారే , కనికా కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద ‘గదర్ 2’ చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్న సన్నీ డియోల్, ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ‘బట్వారా 1947’ చిత్రంతో థియేటర్లలో మరోసారి వసూళ్ల విధ్వంసం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.