Prabhas: ప్రభాస్ రెబల్ మూవీ ఫ్లాప్‌కు కారణం అతడే.! ఒకటి అనుకుని ఇంకోటి తీశాడు..

Prabhas: ప్రభాస్ నటించిన 'రెబల్' సినిమా ఎందుకు ప్లాప్ అయ్యింది? రీసెంట్‌గా రైటర్ డార్లింగ్ స్వామి చేసిన కామెంట్స్ ఇలా ఉన్నాయి.

Update: 2026-05-30 12:30 GMT

Prabhas: ప్రభాస్ రెబల్ మూవీ ఫ్లాప్‌కు కారణం అతడే.! ఒకటి అనుకుని ఇంకోటి తీశాడు..

Prabhas: ఒక సినిమా మీద భారీ అంచనాలతో థియేటర్‌కు వెళ్ళినప్పుడు, ఆ సినిమా ప్లాప్ అయితే మనకు ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులకైతే ఆ నిరాశ మరింత ఎక్కువగా ఉంటుంది.

"అసలు ఈ సినిమా ఎందుకు తీశారు?" అని మనం చాలాసార్లు మన స్నేహితులతో అనుకుంటూ ఉంటాం. సరిగ్గా ఇలాంటి విషయాల గురించే ప్రముఖ రైటర్ డార్లింగ్ స్వామి రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా 'రెబల్' గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన 'రెబల్' సినిమా అప్పట్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే ఆ సినిమా ఎందుకు వర్కౌట్ కాలేదు? దీనికి స్వామి చాలా క్లియర్‌గా సమాధానం చెప్పారు. లారెన్స్ ఉద్దేశం ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని విధంగా ఒక స్టైలిష్ యాక్షన్ హీరోగా చూపించడం. ఆ విషయంలో ఆయన నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు.

ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఫైట్స్, లుక్స్ అద్భుతంగా ఉంటాయి. కానీ, హీరోని ఎలివేట్ చేయాలనే తొందరలో అసలు కథను గాలికి వదిలేశారు. ఆ స్టోరీ రొటీన్‌గా మారిపోవడం వల్లే రెబల్ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచిందని ఆయన అన్నారు. హీరోను అందంగా చూపించడం ఎంత ముఖ్యమో, దానికి తగ్గ బలమైన కథ ఉండటం కూడా అంతే ముఖ్యం కదా! ఇదొక్కటి సరిగ్గా చూసుకుని ఉంటే రెబల్ రిజల్ట్ మరోలా ఉండేదేమో.

Tags:    

Similar News