అదరగొడుతున్న మహేష్ బాబు లేటెస్ట్ లుక్

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్త స్మార్ట్ లుక్‌లోకి మారిపోయారు.

Update: 2026-05-30 06:06 GMT

అదరగొడుతున్న మహేష్ బాబు లేటెస్ట్ లుక్

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్త స్మార్ట్ లుక్‌లోకి మారిపోయారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్లీన్ షేప్, ట్రెండీ స్టైల్‌తో మెరిసిపోతున్న ఆయన లేటెస్ట్ విజువల్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి.

రఫ్ లుక్ నుండి స్మార్ట్ హంక్‌గా మారిన సూపర్ స్టార్

మన తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అనగానే ఎటువంటి సందేహం లేకుండా అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. తన అద్భుతమైన నటన, గ్లామర్‌తో మాస్ , క్లాస్ ఆడియెన్స్ లో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఆయన, ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ కోసం గత కొంతకాలంగా మహేష్ బాబు పొడవాటి జుట్టు, దట్టమైన గడ్డంతో కాస్త రఫ్ లుక్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే, తాజా విజువల్స్‌లో ఆయన గడ్డాన్ని నీట్‌గా ట్రిమ్ చేసి, ఎప్పటిలాగే ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

https://twitter.com/MaheshFanTrends/status/2060342428650107132

వారణాసి షూటింగ్ ముగించుకుని తిరుగుపయనం

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మహేష్ బాబు తన తాజా చిత్రానికి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ ముగించుకుని వారణాసి నుండి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయం వెలుపల ఆయన నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వయసు పెరుగుతున్నా కూడా చెక్కుచెదరని అందంతో మెరిసిపోతున్న సూపర్ స్టార్ లీన్ బాడీ, గ్లామరస్ లుక్ చూస్తుంటే రాజమౌళి ఈ సినిమాలో ఆయనను సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారని స్పష్టమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇటు టాలీవుడ్ తో పాటు అటు గ్లోబల్ సినిమా సర్కిల్స్‌లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి అద్భుతమైన స్వరాలను అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఈ సరికొత్త లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటంతో, సినిమాపై అంచనాలు మరింత ఆకాశాన్ని తాకుతున్నాయి.


Tags:    

Similar News