Anupama Parameswaran: అతని వల్ల రెండేళ్లు మానసిక నరకం చూశా..రిలేషన్‌షిప్‌పై అనుపమ సంచలన కామెంట్స్!
Anupama Parameswaran: గతంలో తాను ఎదుర్కొన్నరిలేషన్‌షిప్, ఎదురైన రెండేళ్ల మానసిక వేధింపులపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సంచలన విషయాలు వెల్లడించారు.
Anupama Parameswaran: అతని వల్ల రెండేళ్లు మానసిక నరకం చూశా..రిలేషన్‌షిప్‌పై అనుపమ సంచలన కామెంట్స్!
Anupama Parameswaran: మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ప్రేమమ్’తో సినీ ప్రయాణం మొదలుపెట్టి, తెలుగులో ‘అ ఆ’, ‘శతమానం భవతి’, ‘కార్తికేయ 2’, ‘టిల్లు స్క్వేర్’ వంటి వరుస విజయాలతో టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్.
తెరపై ఎప్పుడూ చలాకీగా, నవ్వుతూ కనిపించే ఈ ముద్దుగుమ్మ.. తెరవెనుక మాత్రం తీవ్రమైన మానసిక వేదనను అనుభవించానని చెబుతూ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.
ఓ ఇంటర్వ్యూలో తన గత వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ అనుపమ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రేమ మొదట్లో అంతా చాలా బాగుంటుంది. నేను దొరకడం వారి అదృష్టం అన్నంతగా ప్రేమిస్తారు. కానీ అసలు రూపం తర్వాత బయటపడుతుంది. అచ్చం అపరిచితుడు సినిమాలోలా మారిపోతారు అంటూ వాపోయారు.
తాను దాదాపు రెండేళ్లపాటు తీవ్రమైన మానసిక ఒత్తిడి, వేధింపులను ఎదుర్కొన్నానని, అది ఒక అత్యంత విషపూరితమైన బంధమని అనుపమ స్పష్టం చేశారు. ఆ వేధింపుల వల్ల తీవ్రంగా కృంగిపోయానని, కనీసం ‘డ్రాగన్’ సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొననివ్వకుండా అడ్డుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తాను పడిన వేదనను పూసగుచ్చినట్లు వివరించినప్పటికీ, ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం అనుపమ ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, గత కొంతకాలంగా తమిళ యువ నటుడు ధ్రువ్ విక్రమ్‌తో అనుపమ సన్నిహితంగా ఉంటోందంటూ కోలీవుడ్, టాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆమె పరోక్షంగా ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందనే చర్చ సోషల్ మీడియాలో ప్రస్తుతం జోరుగా సాగుతోంది.