Actor Vishal: తమిళ పొలిటిక్స్‌లో కీలక మలుపు.. విశాల్ ఊహించని ఎంట్రీ!

Actor Vishal: తమిళనాడు రాజకీయంలో సీఎం విజయ్, ఉదయనిధి స్టాలిన్ పోరుపై హీరో విశాల్ స్పందించారు.

Update: 2026-08-08 07:38 GMT

Actor Vishal: తమిళ పొలిటిక్స్‌లో కీలక మలుపు.. విశాల్ ఊహించని ఎంట్రీ!

Vijay - Udhayanidhi: తమిళనాడు రాజకీయాల్లో తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. కావేరి జలాలు, మేకెదాటు డ్యామ్ వివాదంతో పాటు నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు, ఆపై ఆయన అరెస్ట్ పరిణామాలు గరం గరం రాజకీయాన్ని రాజేశాయి. ఈ ఉద్రిక్తతల వేళ వర్ధమాన హీరో విశాల్ చేసిన సంచలన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. 

తన తాజా చిత్రం ప్రమోషన్లలో భాగంగా హీరో విశాల్ మాట్లాడూతూ చెన్నై లయోలా కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు. కాలేజీలో విజయ్ తమకు సీనియర్ కాగా, ఉదయనిధి స్టాలిన్ తన బ్యాచ్‌మేట్ అని వెల్లడించారు. కాలేజీ రోజుల్లో మా సీనియర్ విజయ్ మా బ్యాచ్‌మేట్‌ ఉదయనిధిను ఇలా అరెస్ట్ చేయిస్తారని కలలో కూడా ఊహించలేదు అని వ్యాఖ్యానించారు.

విజయ్ రాజకీయాల్లోకి వచ్చి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని, ఇదంతా పొలిటికల్ గేమ్‌లో భాగమేనని అభిప్రాయపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు పరిమితులు పాటించాలని విశాల్ సూచించారు.

వాక్ స్వాతంత్య్రం అందరికీ ఉంటుంది, కానీ కొన్ని సున్నితమైన విషయాల్లో హద్దులు దాటకూడదు. ముందస్తుగా సిద్ధం చేసుకున్న ప్రసంగాలు కాకుండా ఆవేశంలో మాట్లాడినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. త్రిష విషయంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించి ఉండాల్సింది అంటూ ఉదయనిధి స్టాలిన్‌కు విశాల్ హితవు పలికారు.

మరోవైపు తమిళనాడు అసెంబ్లీ వేదికగా కావేరి జలాల పంపిణీ, మేకెదాటు డ్యామ్ వివాదంపై తీవ్ర దుమారం రేగుతోంది. కర్ణాటక నేతలతో చర్చలకు సిద్ధమైన విజయ్ వైఖరిని ఉదయనిధి తప్పుపట్టగా... తమిళనాడు ప్రజలకు నీళ్లు తేవడం కోసం ఎన్ని అవమానాలు ఎదురైనా భరిస్తాం అని విజయ్ బదులిచ్చారు.

ఇద్దరు ప్రముఖ సినీ నేపథ్యమున్న నాయకుల మధ్య రాజకీయం ఊపందుకున్న వేళ, సీనియర్-బ్యాచ్‌మేట్ బంధాన్ని ప్రస్తావిస్తూ విశాల్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌తో పాటు పొలిటికల్ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.



 


Tags:    

Similar News