OTT: రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2'.. ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు!

OTT: ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ వద్ద దాదాపు 1800 కోట్ల రూపాయల వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన రణ్‌వీర్ సింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ (ధురంధర్: ది రివెంజ్) ఎట్టకేలకు డిజిటల్ తెరపైకి వచ్చేందుకు సిద్ధమైంది.

Update: 2026-05-08 08:09 GMT

OTT

OTT: ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ వద్ద దాదాపు 1800 కోట్ల రూపాయల వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన రణ్‌వీర్ సింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ (ధురంధర్: ది రివెంజ్) ఎట్టకేలకు డిజిటల్ తెరపైకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ స్పై యాక్షన్ డ్రామా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన రావడంతో అభిమానుల నిరీక్షణకు తెరపడింది.

మే 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సందడి

థియేటర్లలో విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ కీలక ప్రకటన చేసింది. మే 14, 2026 నుంచి ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, డిజిటల్ ప్రేక్షకుల కోసం ‘అన్‌కట్ వెర్షన్’ను అందుబాటులోకి తెస్తున్నారు. ఏకంగా 3.52 గంటల సుదీర్ఘ నిడివితో ‘ధురంధర్ 2’ స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 చార్టులలో ధురంధర్ మొదటి భాగం ట్రెండింగ్‌లో ఉండటం విశేషం.

ఇండియాలో స్ట్రీమింగ్ ఎప్పుడు?

భారతీయ ఓటీటీ హక్కుల విషయంలో చిన్న మార్పు చోటుచేసుకుంది. ఇండియాలో ఈ సినిమా డిజిటల్ హక్కులను 'జియో హాట్‌స్టార్' కైవసం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, మే 15 నుంచి భారతీయ ప్రేక్షకులకు ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్స్ ద్వారా పైరసీ ముప్పు పొంచి ఉన్నందున, జియో హాట్‌స్టార్ కూడా మే 14నే విడుదల చేసే దిశగా ఆలోచిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఉత్కంఠ రేపే కథాంశం

ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ జస్కిరాత్ సింగ్ అనే గూఢచారి పాత్రలో నటించారు. ఆపరేషన్ ధురంధర్‌లో భాగంగా హమ్జా అలీ మజారీగా పేరు మార్చుకుని పాకిస్థాన్‌లోకి అడుగుపెడతాడు. అక్కడ బలోచ్ తెగ నాయకుడు రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా)ను మట్టుబెట్టిన తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది. మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) రచించిన ఉగ్రదాడుల ప్రణాళికలను హమ్జా ఎలా అడ్డుకున్నాడు? ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్) నుంచి ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించాడు? అనే అంశాలు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి.

Tags:    

Similar News